Delhi Best Markets: ఢిల్లీ వెళ్తున్నారా, షాపింగ్ చేయాలంటే 5 చీప్ అండ్ బెస్ట్ మార్కెట్లు ఇవే
పాలికా బజార్
కన్నాట్ ప్లేస్ సమీపంలో ఉన్న ఈ మార్కెట్ ఒక అండర్ గ్రౌండ్ మార్కెట్. ఇక్కడ బట్టలు, చెప్పులు, స్పోర్ట్స్ వస్తువులు లభిస్తాయి. బ్రాండెడ్ సామాన్లు కూడా దొరుకుతాయి. క్వాలిటీ మాత్రం బాగా పరిశీలించి తీసుకోవాలి.
సదర్ బజార్
చాందినీ చౌక్ సమీపంలో ఉన్న ఈ మార్కెట్ ఆట వస్తువులు, స్టేషనరీ, ఇంటి వస్తువులు, కాస్మోటిక్స్‌కు ప్రసిద్ధి. చాలా తక్కువ ధరకు గిఫ్ట్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి.
కశ్మీరీ గేట్
పాత ఢిల్లీలో ఉన్న ఈ మార్కెట్ ఎలక్ట్రానిక్స్, పుస్తకాలకు ప్రసిద్ధి. కొత్త, పాత రెండు రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు లభిస్తాయి. కళాశాల విద్యార్ధులకు అవసరమైన స్టేషనరీ కూడా లభిస్తుంది.
లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్
దక్షిణ ఢిల్లీలో ఉన్న ఈ మార్కెట్ వస్త్ర ప్రియులకు బాగా నచ్చుతుంది. ఇక్కడ లేటెస్ట్ ఫ్యాషన్ నుంచి ఎథెనిక్ వేర్ వరకూ అన్ని రకాల ధరల్లో బట్టలు లభిస్తాయి. వీటితో పాటు ప్లేట్స్, చెప్పులు, బ్యాగ్స్ కూడా ఉంటాయి
జనపథ్ అండ్ టిబెటీ మార్కెట్
కన్నాట్ ప్లేస్ సమీపంలో ఉన్న ఈ మార్కెట్ బట్టలు, హస్త శిల్ప వస్తువులు, ఉన్ని వస్త్రాలు, అలంకరణ సామాన్లకు ప్రసిద్ధి. టిబెటీ స్టైల్ పెయింటింగ్స్, హ్యాండ్ లూమ్ చీరలు, అందమైన స్కార్ఫ్‌లు లభిస్తాయి.