Platelets Increase Fruits: డెంగ్యూ రోగులకు ఈ 5 పండ్లు దివ్యౌషధాలే, వెంటనే కోలుకుంటారు
కివీ
కివీలో కాపర్, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తాయి. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి, ఇమ్యూనిటీ పెంచడంలో, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెస్స్ కోసం ఉపయోగపడతాయి.
బొప్పాయి
బొప్పాయి అనేది Platelet సంఖ్య పెంచేందుకు అనాదిగా వాడుకలో ఉన్న అద్భుతమైన వైద్య విధానం. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ డెంగ్యూతో పోరాడే శక్తిని అందిస్తుంది. Platelet సంఖ్యను పెంచుతుంది.
బత్తాయి
బత్తాయిలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో , Platelet సంఖ్య పెంచడంలో ఉపయోగపడుతుంది.
దానిమ్మ
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దాంతో డెంగ్యూ వ్యాధి నివారణకు దోహదపడతాయి. రక్తపోటును అదుపు చేసి Platelet సంఖ్య పెంచుతుంది
కొబ్బరి నీళ్లు
ఇక ప్రకృతిలో విరివిగా లభించే అద్భుతమైన అమృతం కొబ్బరి నీళ్లు. శరీరానికి అవసరమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ అందిస్తుంది. డెంగ్యూలో ఏర్పడే డీ హైడ్రేషన్ సమస్య నుంచి కాపాడుతుంది.