Most Profitable Movies of Tollywood: ‘దేవర’ సహా తెలుగులో ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన సినిమాలు ఇవే..

Mon, 14 Oct 2024-6:55 am,

ఈ యేడాది విడుదలైన హనుమాన్, కల్కి, తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమాలు తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రాల జాబితాలో చేరింది.

1.బాహుబలి 2 : బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా రూ. 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 508 కోట్ల థియేట్రికల్ గా  లాభాలను తీసుకొచ్చింది.

2.బాహుబలి 1 : బాహుబలి 1 ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 118 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్ గా రూ. 186 కోట్ల లాభాలను ఆర్జించింది.

3.కల్కి 2898 :‘కల్కి 2898 AD’ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ గా రూ. 170 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

4.RRR : ఆర్ఆర్ఆర్  ప్రపంచ వ్యాప్తంగా  రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 163.03 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

5.హనుమాన్ :  హనుమాన్  సినిమా ప్రపంచ వ్యాప్తంగా  రూ. 29.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. థియేట్రికల్ గా రూ. 127. 95 కోట్ల లాభాలను ఆర్జించింది.

6.అల వైకుంఠపురములో : ‘అల వైకుంఠపురములో’ మూవీ వరల్డ్ వైడ్ గా  రూ. 84.34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ గా రూ. 75.88 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.  

7. దేవర పార్ట్ -1 : ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘దేవర పార్ట్ -1’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రెండు వారాల్లో రూ. 60 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link