Dhanayoga - Navratri 2024: దసరా రోజే శష, మాళవ్య రాజయోగాలు.. ఈ 3 రాశులవారికి ధనయోగంతో మహర్షదశ!

Fri, 04 Oct 2024-5:02 pm,
Malavya Yoga Benefits

 ఈ 9 రోజుల పాటు అమ్మవారును పూజిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఈ సమయం చాలా శుభప్రదమైనగా భావిస్తారు. ఈ నవరాత్రుల్లోనే కొన్ని ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా విజయదశమి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.   

Malavya Panch Mahapurush Yoga

ఈ ఏడాది 12వ తేదిన దసరా వచ్చింది. అయితే ఇదే సమయంలో శుక్రుడు తులారాశిలో ఉంటాడు. దీంతో ఎంతో శక్తివంతమైన మాళవ్య రాజయోగం కూడా ఏర్పడబోతోంది. కర్మలకు ఫలితాలిచ్చే శని గ్రహం కుంభ రాశిలో సంచార దశలో ఉంటాడు. దీని కారణంగా శష రాజ్యయోగం ఏర్పడబోతోంది. ఈ రెండు యోగాల ప్రభావం మొత్తం అన్ని రాశులవారిపై పడబోతోంది. ముఖ్యంగా 3 రాశులవారిపై ప్రత్యేక్షంగా పడుతుంది. 

Venus Malavya Yoga

మాళవ్య రాజయోగం,  శష రాజ్యయోగాల కారణంగా కొన్ని రాశులవారు ఊహించని విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న ఎలాంటి ఆర్థిక సమస్యలైనా తొలగిపోతాయి. దీంతో పాటు అదృష్టం పెరిగి..అన్ని పనులు సులభంగా చేస్తారు.  

వృషభ రాశివారికి ఈ మాళవ్య యోగం, శశ యోగాలు చాలా శుభప్రభంగా ఉంటాయి. కెరీర్‌కి సంబంధించిన విషయంలో కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఎలాంటి కఠినమైన పనుల్లోనైన ఆఖండ విజయాలు సాధిస్తారు. 

వృషభ రాశివారికి ఈ సమమంలో అడుగడుగునా అదృష్టం పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కోర్టు కేసులకు సంబంధించిన విషయాల్లో కూడా విజయాలు సాధిస్తారు. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.   

ఈ రెండు రాజయోగాల ప్రభావం కారణంగా మకర రాశివారికి వృత్తిపరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. దీంతో పాటు వీరికి వ్యాపారాలు కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా లాభాలు కూడా పెరుగుతాయి.   

తులారాశి రాశివారికి శుక్రుడి సంచారం కారణంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి ఆకర్శణ కూడా పెరుగుతుంది. అలాగే వీరికి ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link