Dhanteras: ధన్ తేరస్ రోజున ఈ వస్తువులు కొంటే మీ ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే.. కుబేరుడు మీ ఇంటిని ఒదలి వెళితే ఒట్టు..
ముఖ్యంగా ధన త్రయోదశి రోజున బంగారం లేదా వెండి ఒక గ్రామై కొనడం వలన జీవితాంతం మీ ఇంట్లో బంగారం, వెండి కొరత ఉండదు.
అంతేకాదు ఈ రోజున చీపురు కొంటే ఎంతో లాభం. చీపురు లక్ష్మీ దేవికి సంకేతం.లక్మీ దేవి ఎక్కడ పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ ఉంటుంది. అందుకే చీపురు కొంటే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి ఇంట్లో ధనం రాజ్యమేలుతుందనే అర్ధం. ఈ నెల 29న ధన తేరస్.
ఈ రోజున బంగారం, వెండి, చీపురుతో పాటు ఏ వస్తువు కొన్న లక్ష్మీ దేవితో సమానం. ముఖ్యంగా చీపురు కొనడం వల్ల ధనలక్ష్మీ అనుగ్రహం ఎల్లపుడు మీ వెంటే ఉండబోతుంది.
అంతేకాదు మిమ్మల్ని ఎపుడు ఆర్దిక బాధలు బాధించవు. అప్పటి వరకు మిమ్మల్ని బాధిస్తున్న కష్టాలు దూరమవుతాయి. ఈ రోజున చీపురు కొని ఆలయాల్లో దానం చేయడం వలన మంచి జరుగుతుది. అలా చేయడం వలన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నశిస్తాయి.
ధన్ తేరస్ రోజున మధ్యాహ్నం సమయం లేదా సూర్యాస్తమయం సమయానికి ముందే కొనడం బెటర్. రాత్రి పూట అసలు చీపురు కొనడం కానీ తేవడం కానీ చేయరాదు. ధన తేరస్ రోజున 2 చీపుర్లు కొనండి. మీ ఇంట్లోకి ఒకటి.. మీ సమీపంలోని ఆలయం లేదా మీరు రెగ్యులర్ గా వెళ్లే ఆలయానికి దానం చేయడం శ్రేయస్కరం.
ధన త్రయోదశి రోజున ఏదైనా మీకు తగిన చీపురు కొనండి. ప్లాస్టిక్ చీపురు మాత్రం అస్సలు కొనుగోలు చేయకండి. చీపురును ఎపుడు నిలబడి పెట్టకూడదు. చీపురు అడ్డంగా ఉంచడం ధనలక్ష్మీ అనుగ్రహం
గమనిక:ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్, సాధారణ నమ్మకాలతో పాటు, జ్యోతిష్యుల సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.