Diabetes Control Foods: మీ డైట్‌లో ఈ కూరగాయలు, ఫుడ్స్ ఉంటే మధుమేహం ఇట్టే మాయం
ఆకు కూరలు
డయాబెటిస్ నుంచి కాపాడుకునేందుకు ఆకు కూరలు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో పాలకూర, మెంతికూర, తోటకూర ప్రధానమైనవి. ఆకుకూరల్లో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. దాంతోపాటు పోషకాలు సంపూర్ణంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది.
బ్రోకలీ
డయాబెటిస్ నియంత్రించేందుకు బ్రోకలీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో సల్ఫొరాఫేన్ ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచుతుంది. బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది.
ఓట్‌మీల్
ఓట్‌మీల్ డయాబెటిస్ నియంత్రణకు మరో అద్భుతమైన డైట్. ఇందులో లిక్విఫైడ్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమక్రమంగా తగ్గుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
పప్పులు - బీన్స్
ప్రోటీన్లు, పైబర్, ఇతర పోషకాలతో నిండిన పప్పులు, బీన్స్ డైట్‌లో చేర్చాలి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
డ్రై ఫ్రూట్స్
డయాబెటిస్ నియంత్రణలో డ్రై ఫ్రూట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో బాదం, వాల్‌నట్స్ కీలకమైనవి. ఇందులో ఉండే పోషకాలు, ఫైబర్ కారణంగా డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి.
బెర్రీస్
శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించాలంటే స్టాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ బెర్రీలు తీసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అద్భుతంగా నియంత్రిస్తాయి. మధుమేహం నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తాయి.
పెరుగు
పెరుగు కూడా డయాబెటిస్ నియంత్రణలో అద్బుతమైన సాధనం. పెరుగులో ఉండే ప్రో బయోటిక్స్ , ప్రోటీన్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తాయి.