Diabetes Symptoms: డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి. కళ్లలో కన్పించే మార్పులేంటి

Thu, 05 Sep 2024-6:27 pm,

రాత్రి పూట సరిగ్గా కన్పించకపోవడం

రాత్రి సమయంలో కంటి చూపులో సమస్య ఉంటే అంటే సరిగ్గా కన్పించకుంటే డయాబెటిస్ ప్రారంభ లక్షణం కావచ్చు. ఎందుకంటే డయాబెటిస్ ప్రభావం ముందుగా పడేది కంటి నరాలపైనే. కంటి చూపు మందగిస్తుంది. రాత్రి సమయంలో సమస్యలు ఎదురైతే డయాబెటిస్ అనుమానించాల్సి వస్తుంది

కళ్లలో స్వెల్లింగ్

డయాబెటిస్ ఉంటే కళ్లకు నలువైపులా స్వెల్లింగ్ ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి గమనించవచ్చు. ఈ లక్షణాలు కన్పిస్తే తేలిగ్గా తీసుకోవద్దు. వెంటనే వైద్యుని సంప్రదించాలి

కళ్లలో నొప్పి, ఒత్తిడి

డయాబెటిస్ ఉంటే కంటి నరాలపై ప్రభావం పడుతుంది. దాంతో కళ్లలో నొప్పి లేదా ఒత్తిడిగా అన్పించవచ్చు. కంటి లోపల ఏదైనా నొప్పిగా అన్పిస్తే వెంటనే అప్రమత్తం అవాలి. సకాలంలో చికిత్స చేయించకపోతే పరిస్థితి ప్రతికూలం కావచ్చు

మసకగా కన్పించడం

మీ కళ్లు మసకగా కన్పిస్తున్నా లేక కంటి చూపులో మార్పు కన్పిస్తున్నా తేలిగ్గా తీసుకోవద్దు. డయాబెటిస్ ప్రారంభంలోఇదే పరిస్థితి ఉండవచ్చు. మీక్కూడా ఇలా కన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.

కంటి చూపులో మార్పు

డయాబెటిస్ కారణంగా కంటి చూపులో ఒకేసారి మార్పు రావచ్చు. ఈ మార్పు ఎక్కువగా ఉండవచ్చు. కంటి చూపులో మార్పు కన్పిస్తే అది డయాబెటిస్ ప్రారంభ లక్షణంలో ఒకటి. వెంటనే అప్రమత్తమై వైద్యుని సంప్రదించాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link