Diabetic Patient: మధుమేహం ఉన్నవారు దేశీ నెయ్యిని తినొచ్చా?, తింటే ఎలా తినాలి..?
మధుమేహం ఉన్నవారు దేశీ నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో నెయ్యిని తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.
డయాబెటిక్ పేషెంట్లు దేశీ నెయ్యిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది..ఏమిటంటే..అతిగా నెయ్యిని ఆహారాల్లో తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.
దేశీ నెయ్యిని ప్రతి రోజు తీసుకునే వారిలో శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా అదుపులో ఉంటాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకునేవారు ప్రతి రోజు దేశీ నెయ్యిని వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించి..శరీరాన్ని దృఢంగా చేస్తుంది.
మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు వంట నూనెకు బదులుగా నెయ్యిని వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. రోటీకి అర టీస్పూన్ నెయ్యి అప్లై చేసుకుని తింటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా సులభంగా తగ్గుతుంది.