Bhanupriya: సీనియర్ హీరోయిన్ భానుప్రియ చెల్లెలు ఎవరో తెలుసా.. ఊహించలేదుగా..?

Wed, 06 Nov 2024-5:02 pm,

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో వారసులు ఇండస్ట్రీలోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం.  అయితే ఈ మధ్యకాలంలో వారసులే కాదు సెలబ్రిటీల తోడబుట్టిన వాళ్లు కూడా ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు సీనియర్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని,ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సహాయక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న భానుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈమె విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈమె కోసమే సినిమాకి వెళ్లే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే స్టార్ హీరోలు కూడా ఈమె డేట్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు. అందంలోనే కాదు నటనలో కూడా ఈమెకు పోటీ ఇచ్చేవారు లేరనడంలో సందేహం లేదు. ఇక అలా దాదాపు సీనియర్ హీరోలు అందరి సరసన నటించి ఆకట్టుకుంది భానుప్రియ. 

వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి వంటి ఎంతోమంది హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఈమె,  ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అమ్మ,  అత్త పాత్రలు చేస్తూ అలరిస్తోంది. ఇదిలా ఉండగా భానుప్రియకు చెల్లి ఉందని,  ఆమె కూడా ఒక స్టార్ హీరోయిన్ అని చాలామందికి తెలియదనే చెప్పాలి. 

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ఆమె ఎవరో కాదు శాంతి ప్రియ. కాబోయే అల్లుడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె సింహస్వప్నం, రక్త కన్నీరు, యమపాశం, అగ్ని, కలియుగ అభిమన్యుడు వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. 

తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా  అలాగే హిందీలో కూడా సినిమాలు చేసి మెప్పించిన శాంతి ప్రియ ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో సీరియల్స్ చేస్తోంది.  మరొకవైపు హిందీ సీరియల్స్ లో కూడా నటిస్తోంది శాంతి ప్రియ.  ఏది ఏమైనా భానుప్రియ చెల్లెలు కూడా స్టార్ హీరోయిన్ అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link