Dinesh Karthik Life Story: దినేశ్ కార్తీక్‌కు కట్టప్ప కన్నా దారుణమైన వెన్నుపోటు.. ఫ్రెండ్ భార్యను ప్రెగ్నెంట్ చేసిన ఆ క్రికెటర్ ఎవరో తెలుసా..!
దినేష్ కార్తీక్, మురళీ విజయ్ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇద్దరు కలిసి తమిళనాడు జట్టుకు ఆడారు. దినేష్ కార్తీక్ 21 ఏళ్ల వయసులో తన చిన్ననాటి స్నేహితురాలు నికితను 2007లో వివాహం చేసుకున్నాడు.
నికితా తండ్రి, దినేష్ కార్తీక్ తండ్రి ఇద్దరు మంచి స్నేహితులు. వీరి వివాహం ముంబైలో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లికి మురళీ విజయ్ కూడా హాజరయ్యాడు.
ఆ తరువాత కూడా దినేష్ కార్తీక్‌తో ఉన్న స్నేహంతో వాళ్ల ఇంటికి తరచుగా వెళ్లేవాడు మురళీ విజయ్. ఈ క్రమంలో దినేష్ కార్తీక్ భార్య నికితతో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది.
2012లో తమిళనాడు విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా మురళీ విజయ్, తన భార్య వివాహేతర సంబంధం గురించి దినేష్ కార్తీక్‌కు తెలిసింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
వెంటనే నికితకు విడాకులు ఇచ్చాడు. దినేష్ కార్తీక్ నుంచి విడాకులు తీసుకున్న నికిత.. ఆ తరువాత మురళీ విజయ్‌ను పెళ్లి చేసుకుంది.
దినేష్ కార్తీక్ నుంచి విడిపోయిన నెల రోజులకే నికిత గర్భవతి అని తెలిసింది. ఆ బిడ్డకు తానే తండ్రి అని తెలుసుకుని మురళీ విజయ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
కానీ ఫ్రెండ్‌కు మాత్రం దారుణమైన వెన్నుపోటు పొడిచాడు. ఆ తరువాత మురళీ విజయ్, దినేష్ కార్తీక్ ఈ ఘటన తర్వాత బద్ద శత్రువులుగా మారిపోయారు.
భార్య, ఫ్రెండ్ చేసిన మోసం నుంచి కోలుకోవడానికి దినేష్ కార్తీక్‌కు మూడేళ్లు పట్టింది. ఆ తరువాత 2015లో భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌తో ప్రేమలో పడ్డాడు.