Shaakuntalam Movie: శాకుంతలం మూవీని వీక్షించిన చిత్రబృందం.. సమంత ఫ్యాన్స్ కోలాహలం

శాకుంతలం సినిమాను చిత్రబృందం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి థియేటర్‌లో వీక్షించింది. డైరెక్టర్ గుణశేఖర్, ప్రొడ్యూసర్ నీలిమా గుణశేఖర్, హీరో దేవ్ మోహన్ థియేటర్‌కు వచ్చారు.

సమంత ఫ్యాన్స్ థియేటర్ వద్ద సందడి చేశారు. టపాసులు పేలుస్తూ సందడి చేశారు. శాకుంతలం మూవీ టీమ్‌కు ఘన స్వాగతం పలికారు.

ప్రేక్షకులతో కలిసి శాకుంతలం సినిమాను చూశారు. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి హర్షం వ్యక్తం చేశారు.
సినిమా విషయానికి వస్తే.. శకుంతల క్యారెక్టర్‌లో సమంత పూర్తిస్థాయిలో జీవించింది. అయితే సొంత డబ్బింగ్ కావడంతో కాస్త ఎబెట్టుగా ఉంది.
ఇక అల్లు అర్హ ఎంట్రీతోనే అదరగొట్టింది. సినిమాలో చివరి పావు గంటే అయినా దృష్టి మొత్తం తనవైపు తిప్పుకుంది.