Balu Gaani Talkies: ఓటీటీలో అదరగొడుతున్న ‘బాలు గాని టాకీస్’.. ఆహాలో టాప్‌లో ట్రెండింగ్

శివ, శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు. నేరుగా ఈ సినిమాలో ఓటీటీలో రిలీజ్ అయింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాను శ్రీనిధి సాగర్ నిర్మించగా.. రూపక్ ప్రణవ్ తేజ్, గుడిమిట్ల శివ ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు.

ప్రస్తుతం ఆహాలో బాలు గాని టాకీస్ మూవీ దూసుకుపోతుంది. టాప్-2లో ట్రెండ్ అవుతుండడం విశేషం.
విలేజ్ రివేంజ్, ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి ఓటీటీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
డైరెక్టర్ విశ్వనాథ్ ప్రతాప్ తన మేకింగ్‌తో అందరినీ మెప్పించారు.