Diwali 2024: దీపావళి వేళ బిగ్ అలర్ట్.. బాణసంచా కాల్చేటప్పుడు చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే..
దీపావళి అనేది చెడుపై మంచి గెలిచినందుకు సూచికగా అనాదీగా జరుపుకుంటు వస్తున్నాం. నరక చతుర్ధశి రోజున నరకుడ్ని సత్యభామ దేవీ సంహరించిందని చెప్తుంటారు. ఆ మరుసటి రోజున ప్రత్యేకంగా దీపాలు వెలిగించి దీపావళిని నిర్వహిస్తున్నారు.
దీపాల పండగ రోజే.. పాండవులు తిరిగి తమ రాజ్యంను పొందారనేది మరోక కథనం ప్రచారంలో ఉంది. అయితే.. హిందుసంప్రదాయంలో దీపావళికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పుకొవచ్చు.
ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ధన త్రయోదశి, నరక చతుర్దశి, అమావాస్య, బలిపాడ్యమి, భాయ్ దూజ్ గా ఐదు రోజుల పాటు దీపావళిని జరుపుకుంటారు. అక్టోబరు 29 నుంచి నవంబర్ 2 వరకు కూడా ఈ పండుగలు జరుపుకొనున్నాం.
అయితే.. దీపావళి సందర్భంగా చిన్నా, పెద్ద తేడాలేకుండా టపాకాయలు కాలుస్తుంటారు. బాణసంచాలు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు తరచుగా చెప్తుంటారు.
ముఖ్యంగా టపాకాయలు కాల్చేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలని కూడా ఏపీఎస్డీఎమ్ఏ కీలక సూచనలు చేసింది. పటాకులు కాల్చేవారు తప్పకుండా కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలని సూచించింది. అంతే కాకుండా..బకెట్ నిండా నీళ్లు, ఇసుకను దగ్గర పెట్టుకొవాలి.
ఫ్లవర్ పాట్ లు,హ్యాండ్ బాంబులు కాల్చే సమయంలో చేతితో పట్టుకొవద్దు. ఏదైన క్రాకర్స్ పేలకపోతే.. దగ్గరకు వెళ్లి దానిలో కళ్లు పెట్టి చూసే పనులు చేయోద్దని తెలిపింది. పూలకుండీలు, రాకేట్ లు చేతిలో పట్టుకుని వెలిగించే పనులు చేయకూడదు. అగ్ని ప్రమాదం జరిగితే.. వెంటనే 100, 112, 101, 1070 నంబర్ లకు కాల్ చేయాలని కూడా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఒక ప్రకటలో వెల్లడించింది.