Diwali 2024: లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే.. వీరి ఇంట ధనలక్ష్మీ ఎప్పుడు తిష్టవేసుకుని కూర్చుంటుందంట.. మీరున్నారా...?
ప్రస్తుతం దీపావళి పండగను దేశమంతట కూడా ఘనంగా చేసుకుంటున్నారు. చెడుపై మంచి గెలిచినందుకు గాను దీపావళిని చేసుకుంటారు. నరకాసురుడ్ని సత్యభామ నరక చతుర్దశి రోజు సంహారించిందని చెప్తుంటారు.
దీపావళిని నరకుడి బాధల నుంచి విముక్తి లభించినందుకు దీపాలు వెలిగించి చేసుకుంటారు. ఈరోజున అనాదీగా లక్ష్మీదేవీపూజలు సైతం చేసుకుంటారు. అయితే.. లక్ష్మీదేవీకి కొన్నిరాశులు అంటే ఇష్టమని,వీరిపై అమ్మవారు తన సంపదల వర్షం కురిపిస్తారని సమాచారం.
ముఖ్యంగా మనం జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకొవాలంటే.. లక్ష్మీదేవీ అనుగ్రహాం ఎంతో ఉండాలని పండితులు చెప్తుంటారు. ప్రస్తుతం ధనమూలం ఇదం జగత్ అని చెప్తుంటారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ధనం సంపాదించడంపైన మాత్రమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తొంది.
ధనస్సు ఈ రాశివారంటే.. లక్ష్మీదేవీకి ఎంతో ప్రీతీకరమైనదిగా పండితులు చెప్తుంటారు. వీరికి ఏ పనిచేసిన కూడా అమ్మవారు అనుగ్రహాంతో విజయం ప్రాప్తిస్తుంది. వీరు పెట్టిన దానికి రెట్టింపు ఆదాయం వీరికి సమకూరుతుంది.
కుంభం..ఈ రాశి వారు ముఖ్యంగా విష్ణుదేవుడితో పాటు..లక్ష్మీదేవీకి కూడా ఇష్టమైన రాశి అని సమాచారం. వీరు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారంట. భూముల కొనుగోలు, అమ్మకాలలో వీరు అత్యంత ప్రతిభాపాటవాలు కల్గి ఉంటారు.
తుల ఈ రాశి వారికి కూడా లక్ష్మీదేవీ ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయంట. వీరి తరచుగా బంగారం కొనుగోలు చేస్తారంట. ఉన్నత చదువులు చదువు కొవడంవల్ల విదేశాలకు వెళ్లే అవకాశాలు వీరికి పుష్కలంగా వస్తాయి. ముఖ్యంగా ద్వాదశ రాశులలో ఈ రాశులంటే మాత్రం లక్ష్మీదేవీకి ఇష్టమైన రాశులని పండితులు చెప్తుంటారు.(ఈ స్టోరీ వైరల్ కంటెంట్ ఆధారంగా రాయడం జరిగింది. జీ మీడియా దీన్నిధృవీకరించలేదు.)