Diwali: దీపావళిరోజు స్నానం ఇలా చేస్తే దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట..!
దీపావళి ముందు వచ్చే ధంతేరాస్ రోజు బంగారం, వెండి వారి శాయశక్తుల కొనుగోలు చేస్తారు. అయితే, ఈ రోజు కొనుగోలు చేస్తే ఏడాది పాటు ధనవర్షం కురుస్తుందని నిపుణులు చెబుతారు.
అయితే, ఈ రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 31న రానుంది. ఈ రోజు సాయంత్రం వేళ లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీ అష్టోత్తరాలను పఠిస్తారు.
దీపావళికి ముందు నరక చతుర్ధశి జరుపుకుంటారు. ఈరోజు సాయం కాలం యమదీపం కూడా పెడతారు. దీనివల్ల ఇంట్లో ఆకస్మిక మరణాలు సంభవించవు. ధంతేరాస్ రోజు ధన్వంతరీ అవతరించిన రోజు
దీపావళి రోజు అభ్యంగన స్నానం చేయడం ఎంతో మంచిది. ఈరోజు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం ఆచరించాలి. దీంతో మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుందని జ్యోతిషులు చెబుతున్నారు.
అంతేకాదు ఈరోజు స్నానం చేసే నీటిలో పెరుగు వేసి బాగా కలిపి స్నానం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. ఎందుకంటే దీపావళి రోజే లక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో బయటకు వచ్చింది. అందుకే ఇలా స్నానం చేయాలట.