Student Scheme: విద్యార్థులకు దీపావళి కానుక.. ఒక్కొక్కరి ఖాతాల్లో ఆ రోజే రూ.15,000 జమా చేస్తున్న ప్రభుత్వం..
Thalliki Vandanam Scheme: చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తల్లికి వందనం పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్కీమ్ అమలుకు కీలక అప్డేట్ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా ఏపీలోని విద్యార్థులకు ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15,000 అందించనుంది.
తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుతున్న స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం అమలుకు రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
అయితే, ఈ తల్లికి వందనం పథకం వచ్చే జనవరిలోనే అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సంక్రాంతికి ముందు లేదా ఆ తర్వాత తల్లికి వందనం డబ్బులు విద్యార్థులకు అందించనుంది ఏపీ ప్రభుత్వం.
ఏపీ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో భాగంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, బడికి వెళ్లే విద్యార్థులకు ఏడాదికి రూ.15,000, మహిళలకు రూ.1500 చొప్పున అందిస్తామని చెప్పింది.
ఈ హామీలో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు త్వరలోనే అమలు చేయనుంది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. రూ.20 వేల లబ్ది చేకూర్చే అన్నదాత సుఖీభవ వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.