Indiramma Illu: రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక.. పండుగకు ముందే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి..
రాష్ట్ర ప్రజలకు ఈ తీపికబురును గోషామహాల్ లో ఉన్న డబ్బులు బెడ్ రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి ఈ మేరకు ప్రకటన చేశారు దీపావళికి ముందే అక్టోబర్ నెలలోనే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోందని చెప్పారు.
అంతేకాదు రానున్న నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నమన్నారు .ప్రతి నియోజకవర్గాన్ని 4 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కూడా తెలిపారు.
దీపావళి పండుగ కొత్త ఇంట్లో జరుపుకుంటే బాగుంటుందని ఈ ఇళ్ల పంపిణీ చేస్తున్నామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అంతే కాదు రాంపల్లి లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కూడా పట్టాలు పంపిణీ జరిగిందన్నారు.
గత ప్రభుత్వం కేవలం ఓట్లు దండుకోవడానికి మాత్రమే ప్రకటిచింది. తమ ప్రభుత్వం ఏ హంగూ ఆర్భాటాలు లేకుండా పథకాలను అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. సగం పూర్తి చేసి వదిలేసిన ఇళ్లతోపాటు ఇందిరమ్మ ఇల్లు కూడా పంపిణీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా రబీ సీజన్‌లోనే రైతులకు కూడా రూ.7500 రైతు భరోసా కింద పంపిణీ చేయనున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు సన్నవడ్లకు కూడా రూ.500 బోనస్ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఒక్కో పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటిస్తోంది.