Muhurat Diwali Pick 2024: దీపావళి ముహూరత్ ట్రేడింగ్ కోసం ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రికమండ్ చేసిన టాప్ 7 స్టాక్స్ ఇవే..40 శాతం అప్ సైడ్ ఉండే ఛాన్స్

Tue, 29 Oct 2024-3:13 pm,

Diwali Muhurat Trading: దీపావళి ముహూరత్ ట్రేడింగ్ కోసం మంచి స్టాక్స్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా..అయితే మీ కోసం 7 క్వాలిటీ స్టాక్స్ కొనుగోలు చేయాలని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ రికమండ్ చేసింది. ఈ స్టాక్స్ వచ్చే ఈ దీపావళి నుంచి 2025 దీపావళి దాకా సుమారు 40% వరకు అప్‌సైడ్ టార్గెట్ అందుకునే అవకాశం ఉంది. బ్రోకరేజ్ రికమండ్ చేసిన స్టాక్స్ లో ప్రధానంగా Sansera Engineering, PCBL, NCC, Tata Power, Tech Mahindra, NATCO Pharma వంటి స్టాక్‌లు ఉన్నాయి.  

Sansera Engineering: సన్సెరా ఇంజినీరింగ్ షేర్ ప్రస్తుతం రూ.1533గా ఉంది. రూ.1490-1590 రేంజ్ లో కొనుగోలు చేయడం మంచిది. రూ. 2000 టార్గెట్‌ గా నిర్ణయించారు. 30 శాతం పెరిగే అవకాశం ఉంది.   

PCBL: పీసీబీఎల్ షేర్ ధర రూ.440గా ఉంది. రూ.435-470 రేంజ్ లో కొనుగోలు చేయడం మంచిది. రూ.600 టార్గెట్ నిర్ణయించారు.   

NCC:  ఎన్‌సీసీ షేర్ రూ.288గా ఉంది. రూ.275-300 రేంజ్ లో కొనుగోలు చేయడం మంచిది. రూ.400 టార్గెట్ పెట్టారు. 40% స్టాక్ ధర పెరగవచ్చు.  

Tech Mahindra: టెక్ మహీంద్రా షేరు రూ.1735గా ఉంది. రూ.1680-1750 రేంజ్ లో కొనుగోలు చేయడం మంచిది. 2000 టార్గెట్‌ నిర్ణయించారు.  

Tata Power:టాటా పవర్ షేర్ రూ.437గా ఉంది. రూ.410-450 రేంజ్ లో కొనుగోలు చేయడం మంచిది. రూ.530 టార్గెట్ నిర్ణయించారు.   

NATCO ఫార్మా :  నాట్కో ఫార్మా షేర్ రూ.1343 వద్ద ఉంది. రూ.1300-1390 రేంజ్ లో కొనుగోలు చేయడం మంచిది. రూ.1680 టార్గెట్ నిర్ణయించారు.   

HDFC AMC:  హెచ్‌డిఎఫ్‌సి ఎఎంసి షేర్ రూ.4430 వద్ద ఉంది. రూ.4385-4580 రేంజ్ లో కొనుగోలు చేయడం మంచిది. రూ. 5500 టార్గెట్‌ నిర్ణయించడం మంచిది.  

డిస్ క్లెయిమర్ : జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎలాంటి స్టాక్ రికమండేషన్స్ ఇవ్వదు. స్టాక్  పైన పేర్కొన్న సమాచారం పెట్టుబడి సలహాగా భావించకూడదు. మీరు పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల మార్గనిర్దేశకత్వం తీసుకోవాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link