Samsung Diwali Offers: శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు

Mon, 09 Nov 2020-5:55 pm,

దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ (Samsung  Diwali Offers) దీపావళి ఆఫర్లను ప్రకటించింది. గరిష్టంగా మొబైల్స్‌పై రూ.6500 వరకు డిస్కౌంట్ ధరలు అందించనున్నట్లు తెలిపింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మొబైల్స్ డిస్కౌంట్ ధరలకు అందిస్తోంది. ఆ మోడల్స్ వివరాలు ఇలా ఉన్నాయి.. 

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం51 మొబైల్స్ (Samsung Galaxy M51 Mobile)పై రూ.6500 డిస్కౌంట్ లభిస్తుంది. మార్కెట్ ధర రూ.29,999 కాగా, ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ రూ.22,499కే విక్రయిస్తోంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్. బ్యాటరీ కూడా ఎక్కువే. 7000ఎంఏహెచ్. 

ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ Samsung Galaxy M01 Mobilesపై రూ.2000 డిస్కౌంట్ అందిస్తోంది. దీని మార్కెట్ ధర రూ.9999 కాగా, అమెజాన్‌లో రూ.7999కే కొనుగోలు చేయవచ్చు. 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ ఉంది.

దీపావళి పండుగ నేపథ్యంలో శాంసంగ్ గెలాక్సీ ఎం 31ఎస్ (Samsung Galaxy M31s) స్మార్ట్‌ఫోన్లపై రూ.4500 తగ్గింపు ప్రకటించారు.  కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ అసలు ధర రూ .22999. పండుగ సీజన్ సందర్భంగా Samsung Galaxy M31s Mobile ప్రస్తుతం రూ.18499కు కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్‌లో బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం01 (Samsung Galaxy M01 Mobile) ధర రూ.8499 రూపాయలు. కాగా, ప్రస్తుతం దీని ధర రూ.5999 రూపాయల తగ్గించారు. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 3000 ఎంఏహెచ్. 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం దీని సొంతం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link