Diwali Vastu Tips: దీపావళి రోజున ఈ 7 వాస్తు టిప్స్ పాటిస్తేనే ఇంట్లోకి లక్ష్మీదేవి కటాక్షం
కర్పూరం వెలిగించడం
దీపావళి రోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా కర్పూరం వెలిగించాలి. కర్పూరం వెలిగించడం వల్ల వాస్తు దోషముంటే తొలగిపోతుంది.
మట్టి దీపాలు
ఈ మధ్యకాలంలో మార్కెట్‌లో రంగు రంగుల దీపాలు, లైట్స్ లభిస్తున్నాయి. కానీ దీపావళి రోజున ఇంట్లో మట్టి దీపాలు వెలిగిస్తే చాలా శుభసూచకంగా భావిస్తారు. ఇలా చేస్తే వాస్తు దోషం తొలగిపోతుంది
పింక్ సాల్ట్
దీపావళి రోజు పింక్ సాల్ట్‌తో తడిగుడ్డ పెట్టడం వల్ల ఇంట్లో నెగెటివిటీ ఉంటే బయటకు పోతుంది. పింక్ సాల్ట్‌తో పాటు కొద్దిగా పసుపు కలిపితే ఆ ఇంట్లో సుఖ సంపదలు లభిస్తాయి
రంగోళి
దీపావళి రోజున ఇంటిట బయట, లోపల రంగు రంగుల ముగ్గులు తప్పకుండా వేయాలి. వాస్తు ప్రకారం రంగోలి వేయడం వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నమౌతుంది. రంగోలీలో శ్రీ అని రాస్తే మరింత మంచిది
దేహ్రీ పూజ
వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి రోజున దేహ్రీ పూజ చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ రోజున గుమ్మం శుభ్రంగా ఉండాలి. విరిగి ఉండకూడదు. గుమ్మం విరిగి ఉంటే వాస్తుదోషం ఉంటుంది. దీపావళి రోజున గుమ్మం చుట్టుపక్కల నెయ్యి దీపం వెలిగించాలి.
గుమ్మానికి మామిడి తోరణం
దీపావళి రోజున మామిడాకులతో తోరణం చేసి గుమ్మానికి తగిలించాలి. ఇలా చేస్తే మామిడాకుల సువాసన ఇంట్లోకి దేవతల్ని ఆకర్షిస్తుంది.
ఇంట్లో చెత్త ఉండకూడదు
లక్ష్మీ దేవి ఇంట్లోకి రావాలంటే ఇళ్లు శుభ్రంగా ఉండాలి. శుచి శుభ్రత తప్పకుండా ఉండాలి. ఇంట్లో చెత్త చెదారం కూడబెట్టకూడదు