Diwali Wishes: దేశప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు.. ఏం చెప్పారో తెలుసా?
ప్రతి ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ దీపావళి పండుగ అంటే ఈరోజు గురువారం అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షాలు తెలియజేశారు. ఈ దీపాల వెలుగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని కోరుకుంటున్నా..
ప్రతి ఒక్కరికి ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు, లక్ష్మీగణపతుల ఆశీర్వాదాలు మీపై ఉండాలి అని మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ద్రౌపది ముర్మూ, రాహుల్ గాంధీలతోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.
మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా దీపావళి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. అంతేకాదు పాక్, బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులకు కూడా పవన్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ బాలుడి దీపావళికి సంబంధించిన వీడియో కూడా షేర్ చేశారు.
సీనియర్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావలి వెలుగులు ప్రతి ఒక్కరి జీవితంలోని చీకట్లను తొలగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.