Akshaya Tritiya 2024: అక్షయ తృతీయరోజు ఈ పనిచేశారో మీకు జీవితాంతం ఆర్థిక సంక్షోభమే..
బంగారం.. సాధారణంగా అక్షయ తృతీయ రోజు ఇంటికి బంగారాన్ని కొని తెచ్చుకుంటాం. అయితే ఆరోజు ప్రత్యేకంగా బంగారాన్ని ఎవరికీ గిఫ్టుగా ఇవ్వకూడదు, కుదువ పెట్టకూడదు. ఇంట్లోంచి బయటికి తీయకూడదు. లేకుంటే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని నమ్ముతారు.
చీపురు.. అక్షయ తృతీయ రోజు చీపురుని కూడా పూజించే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఎందుకంటే చీపురుని లక్ష్మీదేవి ప్రతిరూపంగా పూజిస్తారు. పూజ తర్వాత ఈరోజు చీపురుని బయటపెడతారు. సాధరణంగా చీపురును బయట వ్యక్తులకు కనిపించకుండా చీపురును పెట్టాలనే నమ్మకం ఉంది. అక్షయ తృతీయ రోజు ఏదైనా గుడిలో చీపురుని దానంగా ఇవ్వచ్చు. కానీ పాత చీపురును ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో బయటకు పారేయకండి.
ఖాళీ కుండలు.. మీ ఇంట్లో ఏమైనా ఖాళీ కుండలు ఉంటే వాటిని ఈరోజు పారేయకూడదు. అంతేకాదు ఈరోజున ఖాళీగా కుండలు ఉంచకూడదు. వీటిని నీటితో అయినా నింపి ఉంచాలి ఇసుక లేదా నీటితో నింపి పెడితే ఆ ఇంట్లో ఉన్న ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.
అల్యూమినియం.. పవిత్రమైన అక్షయ తృతీయ రోజున బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు అయితే అల్యూమినియం తో తయారు చేస్తున్న వస్తువులను ఈరోజు కొనకూడదు దీంతో ఆర్థిక సంక్షోభం వెంటాడుతుంది.
నల్ల దుస్తులు.. ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజున నల్లటి దుస్తులు ధరించకూడదు కొనకూడదు ఎందుకంటే నల్ల దుస్తులు నెగిటివిటికి సంకేతం ఇది ఇంటికి నెగెటివిటీని తీసుకువస్తుంది అక్షయ తృతీయ పవిత్రమైన రోజు కాబట్టి ఈరోజు నల్లటి దుస్తులకు దూరంగా ఉండాలి.
పదునైన వస్తువులు.. అక్షయ తృతీయ సందర్భంగా కత్తి, కత్తెర్లు వంటి పదునైన వస్తువులు కొనకుండా ఉండాలి . ఈరోజు పదునైన వస్తువులు కొనుగోలు చేస్తే ఆ వ్యక్తికి జీవితంలో విజయాలు వరించవు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)