Money making tips: మీకు 2 Bank accounts ఉన్నాయా ? వెంటనే ఇలా చేయండి.. లేదంటే మీ జేబుకు చిల్లు ఖాయం

Tue, 29 Dec 2020-12:41 pm,

ఉద్యోగులు ఉద్యోగరీత్యా తమ జీవితంలో చాలాసార్లు కంపెనీలను మారుస్తుంటారు. ఇది చాలా మంది విషయంలో జరిగేదే. ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ఎక్కువగా ఎదురయ్యే సమస్య. సంస్థ మార్పు సమయంలో, జీతం కోసం కొత్త బ్యాంకులో ఖాతాలు తెరుస్తారు. కొత్త ఖాతాలు తెరిచినప్పుడు పాత ఖాతా మూసివేయకుండా అలాగే వదిలేస్తారు. ( reuters-photo )

అలా వదిలేసిన ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ లేకపోవడం వల్ల.. ఆ డబ్బులు చెల్లించాల్సిందిగా ఏదో ఓ రోజు సదరు బ్యాంకుల నుంచి మీకు నోటీసులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేదంటే మీకు తెలియకుండా మళ్లీ ఏదో ఓ రోజు మీరు ఆ ఖాతాలో డబ్బును డిపాజిట్ చేసినట్టయితే.. ఆ డబ్బులు మినిమం బ్యాలెన్స్ చార్జీల కింద కట్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.

ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఉద్యోగాలు మారే క్రమంలో ప్రతీ సంస్థ తమ సిబ్బందికి సొంత పేరోల్ ఖాతాను తెరుస్తుంది. అలాంటప్పుడు మునుపటి కంపెనీ ఖాతా దాదాపు ఇనాక్టివ్ అవుతుంది. ఏదైనా పేరోల్ ఖాతాలో మూడు నెలలు జీతం డిపాజిట్ అవకపోతే, అది ఆటోమేటిక్‌గా పొదుపు ఖాతాగా మారుతుంది. అదే సమయంలో ఆ ​​ఖాతాకు సంబంధించిన బ్యాంక్ నియమాలు కూడా మారుతాయి. అప్పటివరకు జీరో బ్యాలెన్స్ ఎకౌంట్‌గా ( Zero Balance bank accounts ) ఉన్న ఆ ఖాతా.. సేవింగ్స్ ఎకౌంట్ అయ్యాకా కనీస బ్యాలెన్స్ ఖాతాలో ( Minimum bank balance accounts ) ఉంచాల్సి ఉంటుంది. లేదంటే, బ్యాంక్ మీ నుంచి జరిమానా వసూలు చేస్తుంది. అవసరమైతే.. ఖాతాలో ఉన్న డబ్బుల నుంచే ఆ మొత్తాన్ని కట్ చేసుకుంటుంది.

ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులతో ఖాతా కలిగి ఉండటం ఆదాయపు పన్ను చెల్లించేటప్పుడు చాలా సమస్యలకు దారితీస్తుంది. మీరు మీ ప్రతి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆదాయపన్ను శాఖకు అందించాల్సి ఉంటుంది. 

మీకు ఉన్న ఖాతాలను వివేకంతో ఉపయోగించకపోతే, మీరు డబ్బును కోల్పోతారు. ఉదాహరణకు మీకు నాలుగు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి అనుకోండి. అన్నింటిలోనూ కనీస బ్యాలెన్స్ రూ .10,000 ఉండాలి. అలాంటప్పుడు ఆ డబ్బుపై మీకు 4% వార్షిక వడ్డీ రేటును అందుకుంటారు. దీని ప్రకారం మీకు సుమారు 1600 రూపాయల వడ్డీ లభిస్తుంది. అలా కాకుండా ఒకవేళ మీరు ఒక్క ఖాతాను ఉంచుకుని మిగతా అన్ని ఖాతాలను మూసివేసి, అదే మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినట్టయితే.. అప్పుడు ఇక్కడ మీరు కనీసం 10 శాతం రాబడిని పొందవచ్చు.

కార్పొరేట్ బ్యాంకులతో ఖాతా కలిగి ఉండటం కూడా భద్రతకు సరైనది కాదు. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ నెట్ బ్యాంక్ ద్వారా తమ బ్యాంక్ ఖాతాలను నిర్వహిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో అన్ని బ్యాంక్ ఖాతాల పాస్‌వర్డులను గుర్తుంచుకోవడం చాలా కష్టం. ఇనాయాక్టివ్‌గా ఉన్న ఖాతాను ఉపయోగించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. అందులో ఉన్న డబ్బులు దొంగలపాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా కాలంగా ఆ ఖాతాలకు సంబంధించి పాస్‌వర్డ్‌ను మార్చకపోవడం వల్ల అది సులువుగా హ్యాకర్స్ చేతికి చిక్కే ప్రమాదం ఉంటుంది. దీన్ని నివారించడానికి, అటువంటి బ్యాంక్ ఖాతాలను మూసివేయడమే ఉత్తమం. ( Image credits : reuters )

ఖాతాను మూసివేసేటప్పుడు, మీరు లింక్ చేసిన ఖాతా ఫారమ్‌ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ బ్రాంచ్ వద్ద ఖాతా మూసివేత ఫారమ్ తీసుకున్న తరువాత, దానిలోని ఖాతాను మూసివేయడానికి గల కారణాన్ని మీరు వివరించాలి. మీ ఖాతా ఉమ్మడి ఖాతా ( Joint account ) అయితే, ఫారమ్‌కు అన్ని ఖాతాదారుల సంతకాలు అవసరం. మీరు రెండవ ఫారమ్‌ను కూడా పూరించాలి. ఇందులో, మీరు మిగిలిన డబ్బును క్లోజ్డ్ ఖాతాకు బదిలీ చేయదలిచిన ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఖాతాను మూసివేయడానికి మీకు మీరే బ్యాంకు శాఖకు వెళ్ళవలసి ఉంటుందనే విషయాన్ని మర్చిపోకండి.

జాగ్రత్తగా గమనించాల్సిన మరిన్ని ముఖ్యమైన విషయాలు:

ఉపయోగించని చెక్, డెబిట్ కార్డును బ్యాంక్ మూసివేత ఫారంతో జమ చేయాల్సిందిగా బ్యాంక్ మిమ్మల్ని అడుగుతుంది. ఖాతాలోని నగదు (రూ .20,000 వరకు) నగదు రూపంలో చెల్లించవచ్చు. ఈ డబ్బును మీ ఇతర బ్యాంకు ఖాతాకు బదిలీ చేసే అవకాశం కూడా మీకు ఉంది. మీ ఖాతాలో మీకు ఎక్కువ డబ్బు ఉంటే, ముగింపు ప్రక్రియను ప్రారంభించడానికంటే ముందుగానే ఆ మొత్తాన్ని మరొక ఖాతాకు బదిలీ చేయండి.

Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

 

Also read :  7th Pay Commission: గుడ్ న్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link