Sai Pallavi: షూటింగ్లో ఏడ్చేసిన సాయి పల్లవి.. కనీసం ఒక్క రోజన్నా వదిలేయండి అంటూ..!

Thu, 14 Nov 2024-7:37 pm,

శేఖర్ కమ్ములా దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో.. నిజంగానే అందరినీ ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ప్రేమమ్ చిత్రంతో మలయాళీ ప్రేక్షకుల మనసును దోచుకున్న ఈ హీరోయిన్.. ఫిదాలో భానుమతి క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకుల మనసుని మరింత దోచుకుంది.  

ఆ తర్వాత నుంచి సాయి పల్లవి చేసే ప్రతి సినిమా.. ఆమె స్థాయిని పెంచుతూనే వెళ్ళింది. ఇక సాయి పల్లవి నానితో చేసిన శ్యామ్ సింగరాయ్ చిత్రం కూడా ఆమె కెరియర్ లో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో సాయి పల్లవి దేవదాసిగా కనిపించి అందరిని మెప్పించింది. 

అయితే ఈ మధ్య గలాటా ప్లస్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి.. ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా షూటింగ్ రాత్రి మొత్తం ఉండేదని. మళ్లీ ఉదయాన్నే కాసేపు నిద్రపోయి లేచి షూటింగ్ కి వెళ్లాల్సి వచ్చేదని చెప్పింది. 

తను ఏమైనా భరించగలనని.. రాత్రి నిద్ర లేకపోతే తన వల్ల కాదని.. కానీ వరసగా నెల రోజులు రాత్రి నిద్ర లేకుండా ఈ సినిమాకి షూటింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఒకరోజు ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు తాను ఏడ్చేసానని.. కనీసం ఒక్కరోజన్నా సెలవు దొరికితే బాగుండు అని చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది. 

కానీ తను సెలవు తీసుకోకుండానే ఆ షూటింగ్ అంతా కంప్లీట్ చేశానని…అయితే అప్పుడు పడిన బాధ తనకు ఇప్పటికీ గుర్తుందని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి కనిపించే సీన్స్ లో.. ఎక్కువ సీన్స్ రాత్రిపూట చిత్రీకరించినవే. ఇక ఆ సీన్స్ కోసమే సాయి పల్లవి ఇంతలా కష్టపడినట్టు తెలుస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link