Independence Day 2024 : జెండా ఎగరవేయడం..జెండా ఆవిష్కరించడం మధ్య తేడా ఏంటో తెలుసా?

Tue, 13 Aug 2024-11:33 pm,

నేటికీ కూడా చాలామందికి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియని వారు మన దేశంలో చాలామంది ఉన్నారు. వీరిలో పెద్దపెద్ద పదవులను అలంకరించిన వారు సైతం స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియక తికమక పడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరవేయడానికి, గణతంత్ర దినోత్సవం రోజు జెండా ఆవిష్కరణకు మధ్య ఉన్న తేడాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

సాధారణంగా స్వాతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు 15వ తేదీన జెండా ఎగురవేస్తారు. అంటే జెండాను ఎగురవేయడానికి ముందు స్తంభానికి కింద ప్రదేశంలో జెండాను  మడత పెట్టి మధ్యలో ముడివేసి, పూలు రంగు కాగితాలను పెట్టి తాడుతో నెమ్మదిగా పైకి తీసుకెళ్తారు. పైకి వెళ్లాక ముడిని విప్పగానే పూలు బయటకు వస్తాయి. ఇలా జెండా ఎగురవేసే మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే జెండా ఎగురవేయడం అనేది ఆగస్టు 15న మాత్రమే జరుగుతుంది.   

జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయరు. ఆరోజు జెండాను ఆవిష్కరిస్తారన్న సంగతి గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ జెండా ఎగురవేయడం అనేది దేనికి సంకేతమో తెలుసుకుందాం. మన దేశం బ్రిటిష్ పాలనలో సుమారు 200 సంవత్సరాల పాటు బానిసత్వాన్ని అనుభవించింది. ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశం ఒక స్వతంత్ర దేశంగా నూతన రాజ్యాంగ ఆవిర్భవించింది. ఎందుకు సంకేతంగా ఆ రోజు జెండాను ఎగురవేస్తారు.  

జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఎర్రకోట మీద నిర్వహిస్తారు. ఎర్రకోటపై ప్రధానమంత్రి ఈ జెండా వందనోత్సవానికి పాలుపంచుకుంటారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఎగురవేసి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇదే పద్ధతిలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా జెండా ఎగురవేస్తారు. దేశ స్వాతంత్రాన్ని గుర్తుచేస్తూ ఈ పర్వదినాన్ని భారతీయులు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

ఇప్పుడు గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకుందాం. గణతంత్ర దినోత్సవం రోజున జెండాను ఆవిష్కరిస్తారు. ఇప్పుడు జెండా ఆవిష్కరణకు జెండా ఎగురవేయడానికి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. జెండా ఆవిష్కరించడం అంటే స్తంభం పైభాగంలోనే జెండాను ముడివేసి ఆ తర్వాత ఆ ముడిని లాగడం ద్వారా జెండాను ఆవిష్కరించడం జరుగుతుంది. అయితే ఇది దేనికి చిహ్నం అంటే మన దేశం  గణతంత్ర, ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడిందని సూచించడానికి ఈ గణతంత్ర వేడుకలను నిర్వహిస్తారు. ఇక ఢిల్లీలో జెండా ఆవిష్కరణను రాష్ట్రపతి నిర్వహిస్తారు.  

ఇక స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి మధ్య తేడా ఏమిటంటే, స్వాతంత్ర దినోత్సవం అనేది 1947లో బ్రిటిష్ రాచరిక వ్యవస్థ నుంచి భారతదేశ విముక్తి పొంది ఒక నూతన రాజ్యాంగ ఆవిర్భవించింది. ఇక 1955 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. తద్వారా మన దేశం సర్వ స్వతంత్ర గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం మధ్య తేడాలు గమనించడం ద్వారా పొరపాట్లు జరగకుండా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link