Samantha-Prabhas: సమంత - ప్రభాస్ కాంబోలో అందుకే మూవీ రాలేదా..?

Sat, 26 Oct 2024-7:35 am,

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా అడుగుపెట్టి,  తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది.

మహేష్ బాబు దూకుడు సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంది.అలా అల్లు అర్జున్ , రామ్ చరణ్,  పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విజయ్ దేవరకొండ, నాగచైతన్య , నాని వంటి టైర్  -2 హీరోల సినిమాలలో కూడా నటించి మెప్పించింది. 

ఇకపోతే తెలుగులో ఉండే స్టార్ హీరోల అందరి సరసన నటించిన సమంత ఎందుకు ప్రభాస్ తో జత కట్టలేదు అనే అనుమానాలు ఇప్పటికే ప్రభాస్ అభిమానులను కలిచి వేస్తున్నాయి.   

అయితే దీనికి కారణం హైట్ అంటూ ఒక వార్త తెరపైకి  వచ్చింది.  ప్రభాస్ హైట్ ఆరడుగులు అయితే సమంత 5.2 అడుగులు మాత్రమే. అందుకే వీరిద్దరి కెమిస్ట్రీ తెరపై అంతగా పండలేదని , ఈ నేపద్యంలోనే ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు అంటూ కొంతమంది వార్తలు సృష్టించారు.   

అయితే మరోవైపు ఇంకో వార్త తెరపైకి వచ్చింది. సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ నటించింది కదా ఆమె హైట్ కూడా 5.2 ఆమె ప్రభాస్ సరసన నటించగా లేనిది , సమంతా నటిస్తేనే హైట్ ప్రాబ్లమ్ వచ్చిందా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా వీరిద్దరి కాంబినేషన్లో ఎందుకు సినిమా రాలేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link