Boost child Memory: మీ పిల్లలకు జ్ఞాపకశక్తి తక్కువగా ఉందా? ఈ చిట్కాతో వారి మెదడు కంప్యూటర్ లాగా పనిచేస్తుంది..
జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం వల్ల ఇది ప్రతి పిల్లలవాడికి ఇబ్బంది కలిగిస్తుంది. దీంతో పరీక్షలో ఏదీ గుర్తుండగా అనుకున్న మార్కులు సాధించలేరు. ఇతర పిల్లల కంటే వీళ్లు కాస్త వెనుకబడి ఉంటారు. అయితే, కొన్ని చిట్కాలను పాటిస్తే వారి మెమొరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.
కొంతమంది పిల్లలకు చదుకున్నా వెంటనే మర్చిపోతారు. దీనికి కారణం వారికి మెమొరీ పవర్ తక్కువగా ఉండటం. ఇలాంటి పిల్లలకు సమతుల్య ఆహారం పెట్టాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మెమొరీ బూస్టింగ్ కోసం పిల్లలకు రాత్రిళ్లు సరైన నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా ఉంటే అన్నీ విషయాల్లో పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు.
పిల్లలకు ప్రధానంగా మొబైల్ ఫోన్ పరీక్షల సమయంలో అస్సలు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి ముందు నుంచే సరైన చర్యలు తీసుకోవాలి.
అంతేకాదు పిల్లలకు వ్యాయామం చేయడం కూడా అలవాటు చేయాలి. ముఖ్యంగా సూర్య నమస్కారం వంటివి అలవాటు చేయాలి.
ఉదయం పిల్లలకు నానబెట్టిన బాదం, వాల్‌నట్స్ పిల్లలకు ఇవ్వాలి. బాదంతో పాలు, తేనె కూడా కలిపి ఇవ్వచ్చు.