Cyclone Survival Tips P2: తుపాను సమయంలో చేయకూడని పనులు ఇవే!
తుపాను సమయంలో పుకార్లు బాగా వస్తుంటాయి. అలాంటి వాటిని నమ్మి ఇబ్బంది పడకండి. పూర్తిగా తెలుసుకోకుండా ఎవరికీ షేర్ చేయకండి.
మొబైల్ షోన్లు, పవర్ బ్యాంకులు సిద్ధంగా ఉంచుకోండి. వాటిని ఫుల్ చార్జింగ్ చేసి పెట్టండి. ఎస్సెమ్మెస్ సర్వీసులు వాడండి.
తాజా వాతావరణ రిపోర్టు కోసం రేడియో వినండి, టీవీ చూడండి, లేదా పేపర్లు ఫోలో అవండి..
మీ డాక్యుమెంట్లు, ఇతర విలువైన వస్తువులను ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉంచండి.
అత్యవసర పరిస్థితి కోసం కొన్ని ఎమర్జెన్సీ కిట్ సిద్ధం చేసుకోండి.
మీ ఇంటికి జాగ్రత్తగా చూసుకోండి. రిపైర్లు చేయించండి. ఇంటిపై కప్పుపై చెట్ల కొమ్మలు ఉంటే వాటిని కట్ చేయండి.
ముందుస్తుగా సిద్ధంగా ఉండటం వల్ల అధికారులు సూచనలను బట్టి మీరు వెంటనే చేయాల్సినవి వెంటనే చేయగలరు. సురక్షితంగా ఉండగలరు.