White Hair: తొక్కే కాదని చీప్‌గా తీసి పారేయొద్దు.. అది తెల్ల జుట్టును నల్లగా చేసే దివ్యౌషధం
తొక్కే కాదని తీసి పారేయకండి. మీ తెల్ల జుట్టును నల్లగా మార్చే శక్తి నారింజ పండు తొక్కకు ఉంది.
ఆరెంజ్ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. ఈ పండు ఆరోగ్యానికి వరం లాంటిది.
ఈ పండు రసమే కాదు తొక్క కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. తెల్ల జుట్టు సమస్య పరిష్కారానికి ఔషధంగా పని చేస్తుంది.
నారింజ పండు ఆరోగ్యంతో పాటు చర్మం.. జుట్టుకు కూడా మేలు చేస్తుంది. నారింజ తొక్కను ఉపయోగించడం ద్వారా మీరు తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
ఆరెంజ్ పండు తొక్కను కెమికల్ హెయిర్ డై కాకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఉపయోగించవచ్చు.
నారింజ పండులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. నారింజలో విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఇవి జుట్టుకు మెరుపునిస్తాయి. నారింజ తొక్కతో జుట్టు పొడవుగా.. ఒత్తుగా.. దృఢంగా కూడా తయారవుతుంది.
నారింజ తొక్కను ఎండబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. నారింజ తొక్క పొడికి ఒకటి లేదా రెండు చెంచాల కొబ్బరి నూనె, అలోవెరా జెల్, రోజ్ వాటర్ కలపాలి.
కలిపిన ఆ మిశ్రమాన్ని (ప్యాక్)ని జుట్టు వేర్ల నుంచి చివరి వరకు పూసుకుని మసాజ్ చేసుకోవాలి. అలా 10 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచిన అనంతరం గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.
నారింజ పండుగ తొక్కతో ఇలా వారానికి 2-3 సార్లు వేసుకుంటే తెల్ల జుట్టు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.
గమనిక: ఇది సాధారణ సమాచారం ఆధారంగా అందించాం. అయితే ఈ విషయాన్ని జీ న్యూస్ ధృవీకరించడం లేదు. ఇది పాటించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోండి.