Honey Precautions: తేనెతో పొరపాటున కూడా ఈ పదార్ధాలు కలిపి తినకూడదు
కీరా
తేనె, కీరా రెండూ ఆరోగ్యపరంగా మంచివే అయినా రెండూ కలిపి ఒకేసారి తినకూడదు. ఎందుకంటే రెండింటి స్వభావం వేర్వేరుగా ఉంటుంది. కీరా చలవ చేస్తే తేనె వేడి చేస్తుంది. రెండూ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
సిట్రస్ ఫ్రూట్స్
తేనెలో ఎప్పుడూ సిట్రస్ ఫ్రూట్స్ రసం కలపకూడదు. ఎందుకంటే సిట్రస్ ఫ్రూట్స్‌లో ఉండే యాసిడ్ తేనెతో కలపడం వల్ల రుచి, గుణం రెండు మారుతాయి. దాంతో తేనెతో ప్రయోజనాలకు బదులు నష్టం కలుగుతుంది.
తేనెతో ప్రయోజనాలు
తేనె తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. శరీరాన్ని వివిధ రకాల వైరల్ , బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. గాయాలు త్వరగా మానుతాయి. గొంతు గరగర తగ్గించవచ్చు. ఇమ్యూనిటీ పెంచవచ్చు.
పాల ఉత్పత్తులు
పాలలో లేదా పాలతో చేసే ఉత్పత్తుల్లో తేనె కలిపి తీసుకోకూడదు. పాలలో కలిపి తీసుకోవడం వల్ల పాలతో కలిగే ప్రయోజనాలు ఉండవు. తేనే విషంగా మారవచ్చు. ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
వెల్లుల్లి
వెల్లుల్లి అనేది ఆరోగ్యపరంగా చాలా మంచిది. కానీ పొరపాటున కూడా తేనెతో కలిగి తినకూడదు. వెల్లుల్లిలో ఉండే యాసిడ్ కారణంగా తేనెలో కలిపితే పోషకాలు తొలగిపోతాయి. ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
వేడి వేడి పదార్ధాలు
తేనెను ఎప్పుడూ వేడి నీళ్లు, వేడి పాలు, వేడి వస్తువులతో కలపకూడదు. లేకపోతే తేనెలోని పోషకాలు, ఎంజైమ్స్ అంతమౌతాయి.