Double Head Snake: హైదరాబాద్‌లో రెండు తలల పాము హల్‌చల్.. ఏం చేసిందంటే..?
సాధారణంగా పామును ఒక తలతో చూసి ఉంటారు. అత్యంత అరుదుగా రెండు తలలతో పాములు కనిపిస్తుంటాయి.
రెండు తలల పాము హైదరాబాద్‌లో హల్‌చల్ చేసింది. పామును తరలిస్తున్నారనే సమాచారం పాతబస్తీలో కలకలం రేపింది.
పాతబస్తీ బహదూర్‌పుర ప్రాంతంలో రెండు తలల పామును కొందరు తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న స్థానికులు వారిని పట్టుకున్నారు.
పట్టుకున్న రెండు తలల పామును బహదూర్‌పుర పోలీసులకు అప్పగించారు. పామును తరలించడం నేరంగా పోలీసులు పేర్కొన్నారు.
పామును పరిశీలించి ఆ తర్వాత నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు ఆ పామును బహదూర్‌పురా పోలీసులు అప్పగించారు.