Pfizer vaccine: ఫైజర్ వ్యాక్సిన్ పనిచేయడం లేదా..వ్యాక్సిన్ తీసుకున్న నర్శ్‌కు కరోనా పాజిటివ్
కరోనా వ్యాక్సిన్ తీసుకోకముందే నర్శ్‌కు కరోనా సోకి ఉండవచ్చని కూడా కొందరంటున్నారు.
అయితే నిపుణులు చెప్పేది వేరేలా ఉంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిరోజుల తరువాత పాజిటివ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. వ్యాక్సిన్ ట్రయల్ సందర్బంగా ఈ విషయం తెలిసిందన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 10-14 రోజుల తరువాత సదరు వ్యక్తిలో ఇమ్యూనిటీ వృద్ధి అవుతుంది. పూర్తి రక్షణ కోసం రెండవ డోసు కూడా తీసుకోవాలి.
డిసెంబర్ 18వ తేదీన 45 ఏళ్ల నర్శు మేధ్యూకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. కానీ 6 రోజుల తరువాత ఆమెలో కరోనా వైరస్ లక్షణాలు కన్పించాయి. మేథ్యూ పని చేసేది కరోనా వైరస్ వార్డులోనే.
శ్యాన్ డియోగోలో ఉండే నర్శ్ మేథ్యూ డబ్ల్యూ ఫైజర్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం సైడ్ ఎఫెక్ట్ కన్పించింది. చేయి నొప్పి ప్రారంభమైంది.