Belly Fat: కరివేపాకుతో ఇలా జ్యూస్ తాగితే బెల్లీఫ్యాట్ వారంలో ఇట్టే కరిగిపోతుంది..
కరివేపాకులో ఖనిజాలు.. కరివేపాకులో యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు ఉంటాయి. అంతేకాదు కరివేపాకులో విటమిన్ బీ2, బీ1, ఏ, ఐరన్, క్యాల్షియం, ప్రోటీన్ ఉంటుంది. దీంతో అనేక రోగాలకు దూరంగా ఉండొచ్చు.
షుగర్ కంట్రోల్.. డయాబెటీస్‌తో బాధపడేవారు షుగర్ నియంత్రణలో పెట్టుకోవాలి. అయితే, కరివేపాకులో మెడిసినల్ గుణాలు ఉంటాయి. ఇది హైపోగ్లైసెమిక్ గుణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగనివ్వవు.
రక్తహీనత.. కరివేపాకును డైట్లో చేర్చుకోవడం వల్ల రక్తహీనతకు కూడా చెక్ పెట్టొచ్చు. ఉదయం పరగడుపున కరివేపాకు జ్యూస్ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అలసట, బలహీనత, రక్తహీనతకు కూడా చెక్ పెడుతుంది.
కంటి సమస్యలు.. కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే ప్రతిరోజూ మీ డైలీ డైట్లో చేర్చుకోవడం వల్ల కంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
బరువు తగ్గిస్తుంది.. ఒకవేళ మీరు ఒబేసిటీతో బాధపడుతున్నట్లు అయితే, కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్ తయారు చేసుకోవాలి. కరివేపాకు డిటాక్సిఫై డ్రింక్ మాదిరి తీసుకోవచ్చు. దీంతో బరువు తగ్గిపోతారు, అధిక కొవ్వుకు కూడా చెక్ పెట్టొచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)