Wine and Health: ఏ రకమైన వైన్ గుండెకు మంచిదో తెలుసా, వైన్ తాగితే ఆ సమస్య ఉండదట
అయితే మద్యపానంతో కూడా అంటే ఆల్కహాల్‌తో కూడా ఏమైనా ప్రయోజనముంటుందా అనే ప్రశ్న విన్పిస్తోంది. దీనికి సమాధానం ముమ్మాటికీ కాదనే. ఎందుకంటే ఆల్కహాల్ ఫ్రీ వైన్‌తోనే ప్రయోజనమనేది ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ లేని వైన్‌లోనే పోలిఫెనోల్స్ ఉంటాయిట. అదే సమయంలో ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ సేవిస్తే గుండెకు నష్టం కలుగుతుందట.
రెడ్ లేదా వైట్‌వైన్ తాగడానికి కొరోనరీ హార్ట్ డిసీజెస్‌కు మధ్య కచ్చితంగా సంబంధముందనేది పరిశోధకుల వాదన. అధ్యయనంలో కూడా రెండు రకాల వైన్‌లు ఈ కోరోనరీ హార్ట్ డిసీజ్‌లో సురక్షితమని తేలింది. అయితే ఇతర రకాల గుండె సంబంధిత వ్యాధుల్లో ఎంతవరకూ మేలు చేకూరుస్తుందనేది ఇంకా స్పష్టత లేదు.
ఏంగ్లియా విశ్వ విద్యాలయంకు చెందిన డాక్టర్ రూడోల్ఫ్ 4 లక్షల 46 వేలమందిపై పరిశీధనలు చేశారు. ఈ పరిశోధనలో వైన్ తాగేవారితో తాగనివారిని పోల్చి చూశారు. ఆ తరువాత ఫలితాల్ని విశ్లేషించారు.
పోలీఫెనోల్స్ అనే పదార్ధాలు ఎక్కువగా కూరగయాలు, ధాన్యాల్లో ఉంటాయనేది పరిశోధకులు చెప్పే మాట. వైన్‌లో పోలీఫెనోల్స్ ఎక్కువ మోతాదులోనే ఉంటుందట. ఈ పోలీఫెనోల్స్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. వాస్తవానికి పోలీఫెనోల్స్ పోషకపదార్ధం. ఎక్కువగా ప్రాకృతికంగా మొక్కల్లో ఉంటుంది. 8 వేలకు పైగా ఉండే పోలీఫెనోల్స్‌లో పండ్లు కూడా ఉన్నాయి. కూరగాయలున్నాయి.
ఇంగ్లండ్‌లోని ఏంగ్లియా రస్కిన్ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో..వైన్ తాగడం ద్వారా గుండె సంబంధిత రోగాల్నించి తప్పించుకోవచ్చని తేలింది. ద్రాక్షలో ఉండే పోషక పదార్ధాల కారణంగా రెడ్ అండ్ వైట్ ఆర్టరీస్‌కు ప్రయోజనం కలుగుతుందని అధ్యయనంలో తేలింది. అందుకే వైన్ ద్వారా గుండె రోగాల్నించి తప్పించుకోవచ్చంటున్నారు.