Motorola E13 Price: 27 శాతం తగ్గింపుతో కేవలం రూ.7,000లకే Motorola E13 మొబైల్..ఫీచర్స్, డిస్కౌంట్ వివరాలు ఇవే!
ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగులు, వేరియంట్స్‌లో లభిస్తోంది. 64 GB స్టోరేజ్ కలిగిన ఈ మోటోరోలా e13 స్మార్ట్‌ఫోన్ రూ. 7,999 లభిస్తుంది. ఇక 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ ఫోన్ రూ. 8,999 అందుబాటులో ఉంది.
ఫ్లిఫ్‌కార్ట్ మొదట మోటోరోలా e13 (MOTOROLA e13) మొబైల్‌ను ధర రూ. 10,999కు విక్రయించింది. చవితి నవరాత్రుల ఆఫర్స్‌లో భాగంగా ఈ మొబైల్ ఫోన్‌పై 27 శాతం తగ్గింపుతో రూ. 7,999కే లభిస్తోంది. అంతేకాకుండా మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ మోటోరోలా e13 (MOTOROLA e13) స్మార్ట్‌ఫోన్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్ అదనపు డిస్కౌంట్‌ను పొందడానికి ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్ చేసి దాదాపు రూ. 399 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక అన్ని ఆఫర్స్ పోను ఈ మొబైల్ ఫోన్ రూ. 7,000కే పొందవచ్చు.
మోటోరోలా e13 (MOTOROLA e13) స్మార్ట్‌ఫోన్ 6.5 inch HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ను కంపెనీ 5000 mAh బ్యాటరీ సమర్థ్యంతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T606 ప్రొసెసర్‌ను కలిగి ఉంటుంది.