Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?
ప్రతి ఏటాపాముల కాటు వల్ల లక్షల మంది ప్రాణాలు కొల్పోతున్నారని అనేక నివేదికలు పేర్కొంటున్నాయి. పాము కాటు వల్ల మనిషి చనిపోయే పరిస్థితులు రాకుండా విరుగుడు మందు తయారీ కోసం సైంటిస్టులు చాలా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దుబాయ్‌లోని సీవీఆర్ఎల్ (సెంట్రల్ వెటర్నరీ లాబోరేటరీ) వారు చెప్పినట్లుగా ఒక వార్త వైరల్ గా మారింది.
సాధారణంగా పాములన్నీపూర్తిగా విషపూరితాలు కావు. వీటిలో కేవలం.. కొన్ని మాత్రమే విషం కల్గి ఉంటాయి. కొన్నిపాములు కాటే వేస్తే సెకన్లలో ప్రాణాలు పోతాయి. నల్లత్రాచు, బ్లాక్ మాంబా, కింగ్ కోబ్రా వంటి పాములు కాటు వేస్తే అంతేసంగతులు. కొన్ని పాములు కాటు వేస్తే.. రెండు గాట్లు పడవు.
వీటిని విషరహితపాములు అని చెబుతుంటారు. పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే మెడిసిన్ తయారీకి నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పాముకాటుకు ఒంటె కన్నీరుతో ఔషధాన్ని తయారుచేసేందుకు దుబాయ్ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో.. ఒంటె కన్నీటితో పాము విషాన్ని తొలగించగల ఔషధం తయారీలో సైంటిస్టులు నిమగ్నమయ్యారు. దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ ఒంటె కన్నీటిని ఉపయోగించి, పాము విషానికి విరుగుడును తయారు చేయవచ్చని వెల్లడించింది.
ఈ ల్యాబ్‌లో ఒంటెన్నీరుపై చాలా ఏళ్ల క్రితం పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఇటీవల.. సరైన ఫండ్స్ లేకపోవడం వల్ల దీనికి అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఫండ్స్ లు కేటాయించిన తర్వాత... తిరిగి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతామని CVRL తెలిపింది.
ఒంటె కన్నీటిలో అనేక రకాల ప్రొటీన్లు, లైసోజైమ్‌లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధిస్తాయి. ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. ఒంటె కన్నీటిలోని ఔషధ లక్షణాలపై అమెరికా, భారత్, తదితర దేశాల్లో సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.