Traffic Advisory: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఈ రూటులో ట్రాఫిక్ మళ్లింపులు..
ఫీఫా కంటినెంటల్ కప్ 2024 ఇండియా, సిరియా, మారిషస్ లు ఉన్నాయి. ఈనేపథ్యంలో గచ్చిబౌలీ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తుగా వాహనదారులకు అలెర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా గచ్చిబౌలీ జంక్షన్ నుంచి లింగంపల్లీ వెళ్లే వాహనదారులు ముందుగానే ట్రాఫిక్ మళ్లింపులు తెలుసుకోండి
జీపీఆర్‌ఏ క్వార్టర్స్ వద్ద ఎడమవైపుగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ఆ తర్వాత గోపిచంద్ అకాడమీ వద్ద రైట్ టర్న్ తీసుకోవాలి. ఇన్పోసిస్ విప్రో జంక్షన్ వద్ద ఎడమవైపుగా వెళ్తూ గోపన్‌పల్లికి కుడివైపుగా మళ్లింపులు చేశారు. యూనివర్శిటీ వెనుకవైపు నుంచి లింగంపల్లికి చేరుకోవాలి.
లింగంపల్లి నుంచి గచ్చిబౌలీకి వచ్చే వాహనాలు హెచ్‌సీయూ డిపో వద్ద లెఫ్ట్‌టర్న్ తీసుకోవాలి. మజిద్ బండా బొటనికల్ గార్డెన్ గుండా వెళ్లాలి. గచ్చిబౌలీకి కుడివైపుగా వెళ్లాలి. ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
మ్యాచ్ షెడ్యూల్.. 2024 సెప్టెంబర్ 3 ఇండియా vs మారిషస్ 19:00 2024 సెప్టెంబర్ 6 మారిషస్ vs సిరియా 19:00 2024 సెప్టెంబర్ 9 ఇండియా vs సిరియా 19:00
ట్రాఫిక్ పోలీసులు ఎక్స్, ఫేస్‌బుక్ వేదికగా షేర్ చేస్తుంటారు. ఫేస్‌బుక్ వేదికగా కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటారు. ట్రాఫిక్ నిబంధనలను ముందుగానే తెలుసుకోండి. వివరాలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయండి.