Jupiter Transit 2025 Effect: బృహస్పతి ఎఫెక్ట్‌తో ఈ రాశులవారికి అద్భుతమైన ధనయోగం.. డబ్బే..డబ్బు!
ఇదిలా ఉంటే 2025 సంవత్సరంలో ఎంతో శక్తివంతమైన గ్రహంగా భావించే బృహస్పతి రాశి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం మిథున రాశి నుంచి తన సంచారాన్ని ప్రారంభించబోతోంది. మిధున రాశి నుంచి ఈ గ్రహం నేరుగా కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. బృహస్పతి గ్రహం చాలా అరుదుగా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది.
సుమారు 13 నెలల తర్వాత గృహస్పతి గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించింది. ఈ గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో సొంతభవనం, ఆనంద, సంపద, శ్రేయస్సు, వైవాహిక జీవితానికి సూచికగా భావిస్తారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కర్కాటక రాశి, కన్య రాశితో పాటు కొన్ని రాశుల వారికి ఈ సంచారం అదృష్టాన్ని కలిగిస్తుంది.
దేవ గురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. కాబట్టి ఈ సొంత రాశి వారికి కూడా విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కొత్త ఆదాయ వనరులు లభించడమే కాకుండా గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి. వీరు పిల్లల నుంచి శుభవార్తలు వినే ఛాన్స్ కూడా ఉంది.
ముఖ్యంగా రాజకీయ రంగాల్లో పనులు చేసేవారు ఈ సమయంలో ఉన్నత పదవులను కూడా వందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు అయితే ఈ సమయంలో ఏ పరీక్ష రాసిన తప్పకుండా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వీరికి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. దీనివల్ల కష్టమైన పనులు కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు.
కన్యా రాశి వారికి కూడా బృహస్పతి సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో కొత్త ఉద్యోగాలు పొందడమే కాకుండా.. భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. అలాగే ఈ రాశుల వారు త్వరలోనే పిల్లలనుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన శుభవార్తలు వింటారు. ఈ సమయంలో ఎలాంటి వ్యాపారాల్లోనైనా పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు.
తులా రాశి వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ఈ సమయంలో బోలెడు లాభాలు పందుతారు. అలాగే వీరికి తండ్రితో అనుబంధం మరింత పెరిగి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి.. అలాగే కుటుంబ సభ్యుల సపోర్టు లభించి ఎంతో ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. అలాగే తులా రాశి వారికి కోరుకుంటున్న కోరికలు కూడా త్వరలోనే నెరవేరబోతున్నాయి.