Shani Dev: 30 ఏళ్లకు శని అనుగ్రహం.. ఈ 4 రాశులకు లక్ష్మీకుభేరయోగం.. 2025 వరకు తిరుగుండదు..!

Fri, 06 Sep 2024-12:03 pm,

శనిదేవుడు కర్మలను బట్టి ఫలాలను అందిస్తాడు అంటారు. అయితే, 30 ఏళ్ల తర్వాత శని అనుగ్రహం కలుగనుంది. శనిదేవుడు  2023 నుండి కుంభరాశిలో ఉన్నాడు, 2025 వరకు ఈ రాశిలో ఉంటాడు. ఆ తర్వాత కుంభ రాశి నుండి మీన రాశిలోకి మారనున్నాడు.   

శని కుంభరాశిలో ఉన్నందుకు కొన్ని రాశులకు అపారమైన ఆనందం, శ్రేయస్సు ,సంపదను పొందవచ్చు. ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.  

వృశ్చిక రాశి.. శని అనుగ్రహం వృశ్చిక రాశివారిపై ఉంటుంది. ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థితిలో నిరంతర అభివృద్ధిని చూస్తారు. అనేక ప్రయోజనాల పొందుతారు. ఈ రాశులకు ఈ సమయంలో మంచి అవకాశాలు లభిస్తాయి. పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు, జీతం పెరుగుతుంది. 

తులారాశి..  తులారాశి వారికి కూడా ఈ సమయంలో శనిదేవుడు మంచి విజయం అందిస్తాడు. అదృష్ట కాలం కూడా. ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఆర్థికంగా లాభపడే అవకాశాలు పెరుగుతాయి. తులరాశి వారికి వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. 

మకరరాశి.. ఈ రాశివారికి ఈ సమయంలో సంపదలు పెరుగుతాయి. శని దయ వల్ల ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. 

కుంభ రాశి.. ఈ రాశి వారికి కూడా ఈ సమయంలో శని అనుగ్రహం వల్ల గౌరవం పెరుగుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆదాయం, ఆస్తులు కూడా పెరిగే అవకాశం ఉంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link