Diwali 2024: దీపావళి లక్ష్మీపూజలో ఆమె సోదరుడు లేకపోతే అసంపూర్ణం.. ఎవరో తెలుసా?
దీపావళి పండుగరోజు రాములు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వస్తాడు. అయోధ్య ప్రజలు ఆరోజు వీధులు మొత్తం దేదీప్యమానంగా దీపాలతో అలంకరిస్తారు. ఆరోజు నుంచే దీపావళి పండుగ ప్రాంరభమైందని చెబుతారు.
అందుకే దీపావళి పండుగను మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఈరోజు లక్ష్మీపూజను ఆనవాయితీగా పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పెడతారు. లక్ష్మీ అష్టోత్తరాలు పఠిస్తారు. అయితే, ఈ పండుగకు లక్ష్మీదేవి పూజలో లక్ష్మీ గణపతులను పూజిస్తారు. వీరు కాకుండా లక్ష్మీదేవి సోదరుడు కూడా ఉండాల్సిందేనట. ఆయన లేకుంటే పూజ అసంపూర్ణం.
క్షీర సాగర మథనంలో లక్ష్మీదేవి బయల్పడింది. ఆమెతోపాటు శంఖం కూడా బయటకు వచ్చింది. అందుకే ఎప్పుడూ లక్ష్మీదేవి చేతిలో శంఖం ఉంటుంది. ఆమెతోపాటు సోదరుడు శంఖం కూడా పూజించాలట. లేకపోతే ఆ పూజ అసంపూర్ణం.
అందుకే దక్షిణముఖ శంఖం, లక్ష్మీదేవిలను సోదరసోదరీమణులుగా పరిగణిస్తారు. అందుకే లక్ష్మీదేవి పూజలో శంఖం ఉండాలి. శంఖం వల్ల ఇంట్లో సుకఃశాంతులు వెల్లివిరుస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దీపావళి ముందే ఇంటికి శంఖం తెచ్చుకోవాలి.
దక్షణాముఖ శంఖంలో సకల దేవతలు నివసిస్తారు అంటారు. ఇంట్లో శంఖం అప్పుడప్పుడు ఊదాలి. అంతేకాదు లక్ష్మీపతి అయిన విష్ణుమూర్తి పూజలో శంఖం పెట్టాలి అంటారు.