Dussehra 2024: దసరా ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేది ఎక్కడో తెలుసా?
ఉత్తరప్రదేశ్.. ఇది మొదటగా చెప్పుకోవాల్సిన ప్రదేశం. ఉత్తరప్రదేశ్‌లో దసరా వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ వారణాసి నగరంలో రావణ దహనం కన్నులపండువగా కొనసాగుతుంది. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడి దసరా ఉత్సవాలు చూడాల్సిందే.
రాజస్థాన్.. దసరా ఉత్సవాలు రాజస్థాన్‌లో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఇక్కడి సంప్రదాయపు నృత్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. చంబల్ నదీ తీరంలో రావణ దహనం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
మైసూర్.. అసలు దసరా అంటేనే మైసూర్. ఇక్కడ ఆయుధ పూజ కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దర్బార్ నిర్వహిస్తారు. మైసూరు ప్యాలస్‌ను దేదీప్యమానంగా అలంకరిస్తారు. ఇక్కడ కూడా సాంప్రదాయ నృత్యాలు అందరినీ అలరిస్తాయి.
హిమాచల్ ప్రదేశ్.. హిమాచల్ ప్రదేశ్‌లో దసరా వేడుకలను ఏడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. హిమాచల్ అంటేనే హిల్ టౌన్. ఇక్కడకు ఒక్కసారైనా వచ్చి దసరా వేడుకలను తనివితీరా చూడవచ్చు.
గుజరాత్.. దసరా వేడుకల్లో గర్భా డ్యాన్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుజరాత్‌లోనే ఇది పుట్టింది. అయితే, ఇక్కడ నవరాత్రుల్లో ప్రతిరోజూ గర్భా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. దండియా కూడా మరో ఆట.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)