Dusshera: బెజవాడ కనకదుర్గమ్మకు ధగధగలాడే వజ్రాల కిరీటం.. రూ.కోట్ల విలువైన కానుక
సంబరాలకు వేళాయే: దసరా సంబరాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయం ముస్తాబైంది.
ఉత్సవాలు: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు విజయవాడ పండుగ శోభ సంతరించుకోనుంది.
కిరీటం: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఓ భక్తుడు ఊహించని కానుకను అందించాడు. శరన్నవరాత్రి ప్రారంభోత్సవాల రోజే బెజవాడ దుర్గమ్మకు బంగారు కిరీటం కానుకగా వచ్చింది.
అజ్ఞాత భక్తుడు: బంగారం, వజ్రాలతో తయారుచేసిన కిరీటాన్ని అమ్మవారికి ఓ అజ్ఞాత భక్తుడు కానుకగా ఇచ్చాడు.
కోట్ల విలువ: విలువైన వజ్రాలతో పొదిగిన ఆ కిరీటం ఖరీదు రూ.2.5 కోట్లు ఉంటుందని సమాచారం.
ఉత్సవాల తొలి రోజు అమ్మవారు ఆ వజ్ర కిరీటంతో బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
భక్తులతో కిటకిట: శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ భక్తులతో కిటకిటలాడుతోంది. వరదల తర్వాత తొలిసారి విజయవాడకు పండుగ శోభ చేకూరింది.
ప్రత్యేక కార్యక్రమాలు: కాగా ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ ఆలయ పాలకమండలి రద్దు చేసింది.