Dussehra: దసరా పండుగ ఆ రోజు మాత్రమే జరుపుకోవాలి? పండితుల సూచన ఇదే..!
దసరా పండుగ ముందు నవ రాత్రులు జరుపుకుంటారు. ఆ తర్వాత దశమి రోజు విజయ దశమి జరుపుకుంటారు. కొందరు 12, మరికొందరు 13వ తేదీ ఎప్పుడు జరుపుకోవాలి అని సందిగ్ధంలో ఉన్నారు.
సాధారణంగా ఏ పండుగ అయినా ఉదయ తిథి ఆధారంగా జరుపుకుంటారు.కానీ, దసరా విషయంలో అలా కాదు. 12వ తేదీ శనివారం దశమి తిథి ఉదయం 10:54 నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది.
ఈ దశమి తిథి మరుసటి రోజు 13వ తేదీ ఆదివారం ఉదయం 9:05 నిమిషాల వరకు ఉంది. ఈనేపథ్యంలో చాలామంది ఉదయ తిథిని అనుసరించి 13వ తేదీ దసరా పండుగ అనుకుంటారు.
అయితే, దసరా పండుగకు శ్రావణా నక్షత్రంతోపాటు దశమి తిథి కూడా సాయంత్రం ఉండాలి. విజయ దశమి ప్రత్యేకించి శ్రావణా నక్షత్రం సాయం కాలం జరుపుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
కాబట్టి ఈ ఏడాది 12వ తేదీ శనివారం రోజు దశమి తిథి, శ్రావణా నక్షత్రం సాయం కాలం రానుంది. దీంతో ఆ రోజే విజయ దశమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఇక కలకత్తా వంటి ప్రదేశాల్లో వారి కాలమానం ప్రకారం 13వ తేదీ ఆదివారం దసరా పండుగ జరుపుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేవలం 12వ తేదీ మాత్రమే ఈ ఏడాది జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
కొన్ని కారణాల వల్ల నవ రాత్రులు అన్ని చేయలేని వారు ఉంటారు. నవమి రోజు ముగ్గురమ్మాలు లక్ష్మీ, సరస్వతి, దుర్గా మాతను పూజించాలి. లేకపోతే లలితా స్వరూపాన్ని పూజించాలి. నవమి తిథి అత్యంత ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)