Navratri 2024: స్థానం మారుతున్న శనీశ్వరుడు.. నవరాత్రుల్లో ఈ రాశుల వారికి డబ్బుల కట్టలే ఇంకా.. మీరున్నారా..?

Fri, 04 Oct 2024-1:25 pm,

ప్రస్తుతం ఎక్కడ చూసి దేవీ నవరాత్రులు కొనసాగుతున్నాయి.  తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తితో కొలుచుకుంటారు. తొమ్మిది రోజుల్లో, తొమ్మిది అవతాలలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో నవరాత్రుల్లోని శనివారం శనీశ్వరుడు తన స్థానం మార్చుకుంటున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మిక  ధనలాభం కల్గనుంది.

శనీశ్వరుడు ముఖ్యంగా కర్మదేవుడిగా చెప్తుంటారు. ఆయన మనం చేసిన పాప పుణ్యాల ఆధారంగా మనకు ఫలితాలను ఇస్తాడంటారు. అందుకే చాలా మంది పండితులు మంచి పనులు చేయాలని చెప్తుంటారు.  ఈ క్రమంలో.. ప్రస్తుతం శనీశ్వరుడు రాశి మారుతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి అనుకొని విధంగా ఆదాయం సమకూరుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  

నవరాత్రులలో.. శనీశ్వరుడు మీనం నుంచి మరల మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల  కొన్ని రాశులకు ఉత్తమ ఫలితాలు, మరికొన్నింటికి మధ్యమ ఫలితాలు, కొన్ని రాశుల వారికి మాత్రం జాక్ పాట్ కల్గించే యోగం ను కల్గించబోతున్నాడు.

చాలా మంది అర్ధాష్టమ శని, సాడేసాతి, శని దేవుడి ప్రభావం వల్ల ఎంతో బాధపడుతుంటారు. అలాంటి వారు నవరాత్రులలో శనిదేవుడ్ని ఏ విధంగా పూజించుకున్న కూడా..  వారికి ఉన్న దోషాలన్ని పోతాయంట. అంతే కాకుండా.. నూనెతో అభిషేకం, నల్లని బట్ట, రావి చెట్టు కింద నెయ్యి దీపం వంటివి పెడితే.. మన జీవితంలో ఉన్న సమస్యలన్ని దూరమౌతాయి.

మేష రాశి వారికి అనుకూల శనీశ్వరుడి ప్రబావం వల్ల రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. మీ వల్ల లాభం పొందిన వారు మరల మీ దగ్గరకు వస్తారు. కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు.

మకరం ..ఈ రాశి వారికి శనీశ్వరుడి ప్రభావం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడి డబుల్ అవుతుంది.  లాటరీలు తగిలే అవకాశం ఉంది. శనీశ్వరుడికి నూనెతో అభిషేకం చేయాలి.

కుంభరాశి.. ఈ రాశి వారికి శనీశ్వరుడి దయ వల్ల విదేశీయానానికి అవకాశం ఉంది.  ఆకస్మిక ధనలాభం కన్పిస్తుంది. స్నేహితులతో కలిసి లాభాలు అర్జిస్తారు. మీరు చేస్తున్న ప్రతి పనిలోను లాభాలు గడిస్తారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link