Dussehra Navratri 2024: అక్కడి వాళ్లకి రావణుడే తోపు.. విజయ దశమి రోజు దహానం చేయకుండా.. పూజలు చేస్తారు.. ఎందుకో తెలుసా..?

Sat, 05 Oct 2024-12:54 pm,

అశ్వయుజ మాసంలో దుర్గా దేవీ శరన్నావరాత్రి ఉత్సవాలను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. తొమ్మిదిరోజులు, తోమ్మిది అవతారాల్లో అమ్మవారు భక్తులకు అనుగ్రహిస్తుంటారు.  చెడుపై మంచి గెలిచినందుకు గాను విజయదశమిని ఎంతో పండుగగా జరుపుకుంటాం. ఇదే రోజున మహిషా సురుడ్నిదుర్గమ్మ వారు సంహారించారని చెబుతారు. అదే విధంగా శ్రీరాముడు తన సతీమణి సీతాదేవీని అపహారించిన రావణుడ్ని సైతం.. ఇదే రోజున సంహరించి సీతమ్మను మరలతన ఇంటికి తెచ్చుకున్నారని చెబుతుంటారు. 

 ప్రతి ఏడాది కూడా విజయ దశమి దసరా రోజున రావణుడి బొమ్మలను ఏర్పాటు చేసి కాలుస్తుంటారు. ఇది ఎప్పటి నుంచి పాటిస్తు వస్తున్నాం.కానీ దేశంలోని కొన్ని రాష్ట్రాలలో రావణాసుడికి పూజిస్తారు. వాళ్లు రావణుడ్ని మాత్రమే దైవంగా భావిస్తారు. అక్కడ దసరా నవరాత్రుల్లో ఇంకా స్పెషల్ గా రావణుడికి ప్రత్యేకంగా పూజలు సైతం చేస్తుంటారు. అక్కడి వాళ్లు లంకాధీశుడికి ఎందుకు పూజిస్తారు.. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్ లోని మందసౌర్ లో దేవీ మండోదరి జన్మించిందంట. మండోదరి, రావణాసుడి సతీమణి. అందుకే ఇక్కడ రావణుడ్ని ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ నగర వాసులు రావణుడ్ని తమ అల్లుడిగా పూజించుకుంటారు.  ఈ నగరంలో చాలా మంది రావణుడిని ఒక పండితుడిగా కూడా భావిస్తారు. అతనిలోని చెడు కంటే అతని ప్రతిభ చాలా గొప్పదని చెబుతుంటారు. మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలో ఉన్న మందసౌర్‌లో 35 అడుగుల ఎత్తైన రావణుడి విగ్రహం కూడా ఉంది.

ఉత్తరాఖండ్ లోని..బైజ్‌నాథ్‌లోని ప్రజలు రావణుడిని పూజించరు. కానీ..  కానీ శివుని పట్ల అతనికి ఉన్న భక్తికి అతన్ని గౌరవిస్తారు. హిందూ పురాణాల ప్రకారం, రావణుడు పరమశివుని అత్యంత భక్తుడు. రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తే శివుని ఆగ్రహానికి గురవుతారని స్థానికులు భావిస్తారు. అందుకు అక్కడ దసరా నవరాత్రులలో రావణుడ్ని స్పెషల్ గా పూజిస్తారు.

ఉత్తరప్రదేశ్ లోని బిస్రత్ లో కూడా రావణుడిని భక్తితో పూజించుకుంటారు. న్యూఢిల్లీ నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బిస్రఖ్ ఒక చిన్న గ్రామం, ఇక్కడ ప్రజలు రావణుడిని తమ సొంతమని పిలుచుకోవడంలో గర్వంగా ఉందని చెబుతుంటారు.. స్థానిక విశ్వాసాల ప్రకారం, విశ్రవ ఋషి, దైత్య యువరాణి కైకేశిల కుమారుడైన రావణుడు బిస్రాఖ్‌లో జన్మించాడు. ప్రజలు రావణుడిని "మహా-బ్రాహ్మణుడు" అని కీర్తిస్తారు.  నిజనికీ, ఈ ప్రదేశంలో స్వయంభూ (స్వయంగా వ్యక్తీకరించబడిన) శివలింగాన్ని కనుగొన్న విశ్రవ ఋషి పేరు మీద ఈ గ్రామం పేరు పెట్టబడిందని కొందరు పేర్కొన్నారు.  

మహారాష్ట్రలోని పరస్వాడి ప్రజలు కూడా రావణుడ్ని కొలుచుకుంటారు. పరస్వాడి గోండు తెగకు చెందిన 300 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామం. ఈ గ్రామ ప్రజలు రావణుడిని దేవుడిగా పూజిస్తారు. గోండు ప్రజలు తమను తాము "రావన్‌వంశీలు" (రావణుడి వారసులు) అని పిలుచుకుంటారు. వీరు.. తమను తాము హిందువులుగా గుర్తించుకోవడానికి నిరాకరిస్తారు. తులసీదాస్ రామాయణంలోనే రావణుడ్ని విలన్ గా చేశారని, వాల్మీకి రామాయంలో రావణుడిని విలన్ గా వర్ణించలేదని చెబుతుంటారు.  

రాజస్థాన్ లోని జోద్ పూర్ లోని మండోర్ లో రావణుడు మండోదరిని పెళ్లి చేసుకున్నాడంట. ఈ వేడుకను మండోర్‌లోని రావణ్ కీ చన్వారీలో నిర్వహించారని స్థానికులు నమ్ముతారు. అందువల్ల కొంతమంది స్థానిక బ్రాహ్మణులు, ముఖ్యంగా మౌద్గిల్స్, రావణుడిని అల్లుడిగా భావిస్తారు. ఈ కారణంగానే ఇక్కడ లంక రాజు దిష్టిబొమ్మను దహనం చేయరు మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో దసరా జరుపుకోరు. అంతేకాకుండా.. రావణ్ కి చన్వారీ ఆలయ పూజారులు రావణునికి హిందూ ఆచారాల ప్రకారం శ్రాధ్, పిండ్ దాన్ చేస్తారు.

ఉత్తర ప్రదేశ్ లోని.. కాన్పూర్‌లోని శివాలయంలోని ఒక శివాలయంలో రావణుడికి అంకితం చేసిన ఆలయం కూడా ఉంది. దసరా సందర్భంగా, రావణుడిని పూజించడం ద్వారా ధనసంపద సొంతమౌతుందని, కొరుకున్న కోరికలు నెరవేరుతాయని చెబుతుంటారు. అందుకే అక్కడ లంకాధీశుడ్ని పూజిస్తారు.  

ఆంధ్ర ప్రదేశ్  కాకినాడ.. ఈ తీర ప్రాంత నగరంలో రావణ దేవాలయం ప్రాథమికంగా శివునికి అంకితం చేయబడిందని చెబుతుంటారు. రావణుడు స్వయంగా ఎంపిక చేసుకున్న స్థలంలో ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ అందమైన ఆంధ్ర పట్టణంలో చాలా మంది రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు.  

మధ్య ప్రదేశ్ విదిషలో కూడా లంకాధీశుడ్ని దసరా నవరాత్రులలో కొలుచుకుంటారు. విదిష నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం రావణుడి పేరు పెట్టబడిందని చెబుతుంటారు. శతాబ్దాల నాటి ఆలయంలో లంకా రాజు రావణుడి యొక్క 10 అడుగుల పొడవు గల శయన విగ్రహాన్ని ప్రజలు పూజిస్తారు. కన్యాకుబ్జ బ్రాహ్మణులు నిర్మించారని నమ్ముతారు - రావణుడు బ్రాహ్మణ వర్గానికి చెందినవాడు. స్థానికుల ప్రకారం, రావణుడి విగ్రహం యొక్క నాభిపై నూనె రాయడం శుభపరిణామం,  నాభిలో బాణం తగిలి మరణించిన లంకా రాజును ప్రసన్నం చేసుకుంటుందని చెబుతుంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link