Shukra Gochar: శుక్రుడి రాశి మార్పు.. ఈ మూడు రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవమే..

Wed, 06 Nov 2024-2:29 pm,

Shukra Gochar: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రుడు విలాసాలకు చిరునామ. అంతేకాదు సినిమాలు, నాటకాలు, అందాల పోటీలు, మరియు సుఖానికి మారు పేరు శుక్రుడు. తాజాగా శుక్రుడు వృశ్చికం నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రాశి మార్పులు శుభప్రదంగా ఉండబోతుంది.

దీపావళి ఐదు రోజుల పండగ తర్వాత శుక్రుడు ధనుస్పు రాశిలోకి ప్రవేశించబోతుంది. దీపావళి తర్వాత  పెద్ద గ్రహాలు వేరే రాశిలోకి ప్రవేశించబోతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. అంతేకాదు సామాజికంగా ఆర్ధికంగా మీ పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది.

ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికి శుక్ర గ్రహ సంచారం వలన అనేక రకాలుగా ప్రయోజనం కలగనున్నాయి. అంతేకాదు మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. ఎంతో ఉల్లాసంగా మీ పని మీరు చేసుకొని పోతారు. శ్రమ జీవులకు ఎంతో ఊరట కలిగించే అంశం.  పెట్టుబడికి ఇదే అత్యంత అనుకూలమైన సమయం.  భవిష్యత్తులో మీ ఆదాయం రెండింతలు అవుతోంది. మితంగా ఖర్చు పెట్టండి.  ఖర్చులపై నిఘా ఉంచండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి.

వృషభ రాశి..

శుక్రుడు రాశి మార్పుల వలన ఉద్యోగంలో ఉన్నత యోగం అందుకుంటారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఫ్రెషర్స్ కు గవర్నమెంట్ ఉద్యోగం లేదా ఏదైనా పెద్ద కార్పోరేట్ సంస్థలో మీకు జాబ్ ఆఫర్ రావచ్చు.  ఆరోగ్య సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.  ఒంటిరిగా జీవితాన్ని లీడ్ చేస్తోన్న వారికీ వివాహా యోగం తప్పక ఉంటుంది.

తులారాశి.. శుక్రుడు రాశి మార్పు తులా రాశి వారికీ ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఆర్ధికంగా ఎన్నో అవకాశాలు వీరి తలుపు తడతాయి. అంతేకాదు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న డబ్బు చేతికి కందుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆర్ధఇకంగా మరిన్ని ప్రయోజనాలు చేకూర్చుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్. పై అధికారుల మెప్పు పొందుతారు. కుటుంబ సంబంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం వెచ్చించే అవకాశాలున్నాయి.

Disclamir: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, జ్యోతిష్యుల నమ్మకాలపై ఆధారపడి ఇచ్చాము. ZEE NEWS దానిని ధృవీకరించడం లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link