Easy Earn Money Tips: వేసవిలో ఈ వ్యాపారాలు చేయండి.. మీ ఇంట డబ్బుల వర్షం కురవడం ఖాయం

Tue, 18 Apr 2023-11:26 pm,

వేసవి కాలంలో ప్రజలు చల్లటి పదార్థాలు సేవించేందుకు మక్కువ చూపుతారు. సమ్మర్‌లో ప్రత్యేకంగా అనేక వ్యాపారాలు పుట్టుకొస్తాయి. మీరు కూడా ఇలాంటి వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించుకోవచ్చు.  

కూల్‌డింక్స్ బిజినెస్ చేసి ఈజీగా డబ్బు సంపాదించవచ్చు. సమ్మర్‌లో శీతల పానీయాలకు భారీ డిమాండ్ ఉంటుంది. వ్యాపారం బాగా జరిగితే.. నెలలో కనీసం 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. జనం రద్దీ ఎక్కువగా ఉంటే ప్లేస్‌లో వ్యాపారం మొదలు పెడితే.. మీ ఇంట సిరుల పంట కురువడం ఖాయం.   

సమ్మర్‌లో ఎక్కువ మంది లస్సీ, మజ్జిగ తాగడానికి ఇష్టపడతారు. చాలా శరీరానికి చల్లదనం అందించడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వ్యాపారం చాలా తక్కువ డబ్బు పెట్టుబడి ప్రారంభించవచ్చు. లస్సీ, మజ్జిగ అమ్మడం ద్వారా రోజుకు రూ.1000 నుంచి 1500 వరకు సంపాదించుకోవచ్చు.  

వేసవి కాలంలో చాలామంది జ్యూస్‌ వైపు కూడా ఆకర్షితలవుతారు. ఈ జ్యూస్ బిజినెస్ చేస్తే రోజుకు రూ.500 నుంచి 800 వరకు లేదా అంతకంటే ఎక్కువగా కూడా సంపాదించవచ్చు..    

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సమ్మర్‌లో తప్పకుండా తినేది ఐస్‌క్రీమ్. హీట్ ఎంత పెరిగితే.. ఐస్ క్రీమ్‌ బిజినెస్‌కు అంత డిమాండ్ ఉంటుంది. ఐస్ క్రీమ్ వ్యాపారం ద్వారా నెలకు రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు సంపాదించవచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link