Eesha Rebba: చీరకట్టులో మరింత గ్లామరస్ గా ఈషా రెబ్బ.. లేటెస్ట్ పిక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
ఈషా రెబ్బ అచ్చ తెలుగు అందం కాబట్టే ఈమెకు సొంత ఇలాగా అయిన టాలీవుడ్ లో సరైన అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. అట్రాక్ట్ చేసే గ్లామర్, యాక్టింగ్ ఉన్నా..సరైన బ్రేక్ మాత్రం ఇప్పటికీ రాలేదు. దీంతో వరుస ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తోంది.
ఈషా రెబ్బ ఒకవైపు సినిమాలు చేస్తూనే ..మరోవైపు వెబ్ సిరీస్ లలో యాక్ట్ చేస్తోంది. ఈషా ఇప్పటకే ‘పిట్ట కథలు’ ‘త్రీ రోజెస్’ సహా పలు వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది.
ప్రస్తుతం ఈషా తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. అందుకే ఎప్పటి కపుడు తన ఫోటో షూట్ లతో హల్ చల్ చేస్తోంది.తాజాగా చీరకట్టులో కనిపించి అభిమానులను కిక్ ఎక్కించింది.
ఆకట్టుకునే గ్లామర్ ఉన్న టాలీవుడ్ అగ్ర హీరోలెవరు ఈషాకు పిలిచి వరుస ఛాన్సులు మాత్రం ఇవ్వడం లేదనే చెప్పాలి. తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ మూవీతో ఇంట్రడ్యూస్ అయిన ఈషా రెబ్బ.. ఇంద్రగంటి మోహనకృష్ణ ‘అంతకు ముందు ఆ తర్వాత‘ సినిమాలో యాక్ట్ చేసింది.
అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ‘లో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించినా ఈషా కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. పెద్ద హీరో సినిమాలో నటించాననే సంతృప్తి తప్పితే ఈషాకు పెద్దగా ఒరిగిందేమి లేదు. అందుకే వరుస ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది.