Encephalitis Virus: దెబ్బ మీద దెబ్బ.. దేశంలో మరో డేంజర్ వైరస్.. ఏకంగా మెదడుకే జ్వరం..
జపనీస్ ఎన్సెఫాలిటిస్ జ్వరం కేసు ప్రస్తుతం భారత్ లో కూడా నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే ఇది గతంలో సోకిన జంతువులు, పక్షుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని తెలుస్తోంది. ఈ వైరస్ ఒక మనిషి నుంచి మరో మంచికి కూడా వ్యాపిస్తుందట.
ఈ జపనీస్ ఎన్సెఫాలిటిస్ వైరస్ అనేది అచ్చం దోమల ద్వారా వచ్చే జ్వరంలా ఉంటుందని డాక్టర్ జుగల్ కిషోర్ తెలిపారు. అయితే దోమకాటు కారణంగా వచ్చే మలేరియా డెంగ్యూ అనేది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. కానీ ఈ వైరస్ మాత్రం సులభంగా సంక్రమిస్తుందిట.
జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాధి కలిగిన వ్యక్తులు ఇతరులకు రక్తం ఇచ్చే సమయంలో వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య చాలా తక్కువ అయినప్పటికీ.. రోజులకొద్దీ పెరుగుతూ వస్తోంది.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్సెఫాలిటిస్ వ్యాధి సోకిన వారు ప్రారంభంలో కొన్ని లక్షణాలను కలిగి ఉంటారు. ఈ వైరస్ సోకిన వారు ముందుగా జ్వరం బారిన పడుతూ ఉంటారు. ఇది పిల్లల్లో సోకితే వారికి చాలా తక్కువ మోతాదురు జ్వరం నమోదవుతుంది. కొన్ని రోజుల తర్వాత వాంతులు విరేచనాలు కూడా అవుతాయి.
ఈ వైరస్ సోకిన వారిలో వాంతులు విరేచనాలు అయిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మనిషి మెదడు కణాలు దెబ్బతిని రోగి ఆరోగ్య పరిస్థితి మరింత దెబ్బతినే అవకాశాలున్నాయి. ఆ తర్వాత మరికొన్ని రోజుల్లోనే ఆ పేషెంట్ మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ వైరస్ సోకకుండా ఉండడానికి దోమల నుంచి మీకు మీరే రక్షించుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చేతులను ఏదైనా ఆహారాలను తినే క్రమంలో శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిది. దీంతోపాటు ఏదైనా జ్వరం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడితే వైద్యులను తప్పకుండా సంప్రదించండి.