Funny Engineering Mistakes Photos: కడుపుబ్బా నవ్వించే ఇంజనీరింగ్ తప్పిదాలు.. ఎవడ్రా బాబూ ఇవి నిర్మించింది అనిపించే వైరల్ ఫోటోలు
Funny Engineering Mistakes Photos: పై అంతస్తులోకి వెళ్లడానికి ఎస్కలేటర్ నిర్మించారు. ఆ ఎస్కలేటర్ ఎక్కడికి వెళ్తుంది అవే విషయం మర్చిపోయారు. మరి పైకి ఎక్కిన వాళ్లు ఎక్కడికి వెళ్లాలి, ఎలా వెళ్లాలి ? ( Image Courtesy: Twitter )
Funny Engineering Mistakes Photos: సింకులో చేతులు, ముఖం శుభ్రం చేసుకోవాలంటే నీళ్లు అందులో పడేలా నల్లాలు బిగించాలి.. కానీ ఇక్కడేం జరుగుతుందో మీరే చూడండి.. ( Image Courtesy: Twitter )
Funny Engineering Mistakes Photos: అమెరికాలోని ఓ పార్కులో లోపలికి అనుమతి నిషేధం అని చెప్పడానికి ఇలా ద్వారాన్ని మూసేశారు. అది బాగానే ఉంది కానీ ఆ ద్వారానికి రెండు వైపులా ఖాళీగానే ఉంది. అక్కడి నుండి వెళ్లే వారిని ఎవరు ఆపుతారు మరి.. ( Image Courtesy: Twitter )
Funny Engineering Mistakes Photos: రద్దీ ప్రదేశాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వాష్ రూమ్స్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. కానీ ఆ వాష్ రూమ్స్ కి వీల్ చైర్లలో వెళ్లే వీలు లేకుండా మెట్లు నిర్మించడం వాళ్ల తెలివితేటలకు అద్దం పడుతోంది. ( Image Courtesy: Twitter )
Funny Engineering Mistakes Photos: సెక్యురిటీ కోసం సీసీ కెమెరా ఏర్పాటు చేశారు కానీ.. దాని ముందే ఏదో అడ్డు గోడ లాంటి స్క్రీన్ కూడా ఉందనే విషయాన్ని మర్చిపోయారు. ( Image Courtesy: Twitter )
Funny Engineering Mistakes Photos: పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేసిన వాళ్లు.. దాన్ని కస్టమర్లకు అందేంత ఎత్తులో ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని మర్చిపోయారు. ( Image Courtesy: Twitter )
Funny Engineering Mistakes Photos: గోడ ఘడియారం బిగించిన చోటే మధ్యలో రాడ్ అడ్డం వచ్చిందా లేక రాడ్ వెనుకాలే గోడ ఘడియారం ఏర్పాటు చేశారా తెలియదు కానీ చివరకు జరిగింది ఇలా ఉంది చూడండి ( Image Courtesy: Twitter )
Funny Engineering Mistakes Photos: కింద నీళ్లు ఉన్న చోట పై నుండి బ్రిడ్జిని నిర్మిస్తారు. కానీ నీళ్లే లేని చోట ఈ బ్రిడ్జితో పనేంటి ? సరిగ్గా గమనిస్తే.. బ్రిడ్జి లేకున్నా ఈ స్విమ్మింగ్ పూల్ దాటేందుకు అవకాశం ఉంది చూడండి. ( Image Courtesy: Twitter )
Funny Engineering Mistakes Photos: పిల్లలు ఆడుకునే చోట జారుడుబండ చివర్లో ఇలా గొవ్వి తవ్వారు. మరి జారుడుబండపై నుంచి వచ్చిన పిల్లలు ఈ గొయ్యిలో పడాలా ? ( Image Courtesy: Twitter )
Funny Engineering Mistakes Photos: సీలింగ్ ఫ్యాన్ బిగించిన చోటే ప్రొజెక్టర్ ఏర్పాటు చేస్తే.. ఆ ఫ్యాన్ ఎలా తిరుగుతుంది ? ఇది బిగించిన ఐటి ఇంజనీర్‌కి ఆ మాత్రం ఐడియా తట్టలేదా ? ( Image Courtesy: Twitter )